FIFA World Cup 2026: అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) కేవలం ఒక ఫుట్‌బాల్ టోర్నమెంట్ మాత్రమే కాదు.. ప్రపంచ క్రీడా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక విప్లవంగా మారబోతోంది. మునుపెన్నడూ లేని విధంగా 48 జట్లు, బిలియన్ల కొద్దీ వ్యూవర్స్, వేల కోట్ల రూపాయల బిజినెస్‌తో ఈ మెగా ఈవెంట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
చరిత్రలోనే అతిపెద్ద వరల్డ్ కప్:
గతంలో కేవలం 32 జట్లతోనే జరిగిన ఈ మెగా టోర్నీని.. ఈసారి ఫిఫా ఏకంగా 48 జట్లకు పెంచింది. దాంతో, ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు 16 నగరాల్లో, 39 రోజుల పాటు రికార్డు స్థాయిలో 104 మ్యాచులు జరగబోతున్నాయి. ఇక గ్లోబల్ పార్టిసిపేషన్‌ను పెంచాలనే ఫిఫా ప్లాన్‌తో ఈసారి కురాకో, కాబో వెర్డే, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి 4 దేశాలు తమ ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోతున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం.. ఈ మ్యాచులను నేరుగా స్టేడియాల్లో చూసేందుకు సుమారు 65 లక్షల మంది (6.5 Million) ప్రేక్షకులు రాబోతున్నారు.
600 కోట్ల మంది వ్యూవర్స్:
ప్రపంచ జనాభాలో దాదాపు ముప్పావు వంతు (Nearly 75శాతం) మంది ఈ వరల్డ్ కప్‌ను టీవీలు, ఓటీటీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చూడబోతున్నారని ఫిఫా అంచనా వేసింది. గత ఖతార్ వరల్డ్ కప్‌ను 500 కోట్ల మంది చూస్తే.. ఈసారి ఆ రికార్డు బద్దలై ఏకంగా 600 కోట్ల మంది (6 Billion) ఈ టోర్నీని ఫాలో అవ్వబోతున్నారు. ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున ప్రపంచవ్యాప్తంగా ఉండే మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 7శాతం ట్రాఫిక్ కేవలం ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ వల్లే జనరేట్ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.
గ్లోబల్ జీడీపీకి బూస్ట్:
ఫిఫా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) సంయుక్త సర్వే ప్రకారం.. ఈ వరల్డ్ కప్ ద్వారా గ్లోబల్ జీడీపీకి ఏకంగా 40.9 బిలియన్ డాలర్లు (సుమారు ₹3.90 లక్షల కోట్లు) యాడ్ అవ్వబోతున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా టూరిజం, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, రీటైల్ రంగాలలో 8.24 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి.
►ALSO READ | బ్రెజిల్ vs మొరాకో మధ్య హై-వోల్టేజ్ ఫైట్.. కీలక పోరుకు నెయ్మార్ దూరం!
అమెరికాకు బంపర్ ఆఫర్:
మూడు దేశాలు ఆతిథ్యమిస్తున్నా.. సింహభాగం లాభాలు అమెరికాకే దక్కనున్నాయి. యుఎస్ జీడీపీకి $17.2 బిలియన్లు (సుమారు ₹1.64 lakh కోట్లు) అదనంగా సమకూరనున్నాయి. కాగా అమెరికాలోనే దాదాపు 1.85 లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ కానున్నాయి.
ఐపీఎల్, ఎన్‌ఎఫ్ఎల్ రికార్డులు ఔట్:
ప్రపంచవ్యాప్త బ్రాండ్స్ అన్నీ ఈ వరల్డ్ కప్‌లో యాడ్స్ ఇవ్వడానికి ఎగబడుతున్నాయి. గ్లోబల్ అడ్వర్టైజర్స్ కేవలం ఈ టోర్నమెంట్ కోసమే ఏకంగా 10.5 బిలియన్ డాలర్లు (సుమారు ₹10,500 కోట్లు) ఖర్చు చేయబోతున్నారు. ఇది భారత్ లో జరిగే ఐపీఎల్ తో పాటు అమెరికాలో మోస్ట్ పాపులర్ అయిన ఎన్‌ఎఫ్ఎల్ (NFL) ఫుల్ సీజన్ యాడ్స్ ఖర్చు కంటే డబుల్ కావడం విశేషం. దీంతో బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్‌షిప్స్, టికెట్ సేల్స్ ద్వారా ఫిఫా సంస్థ రికార్డు స్థాయిలో 8.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని టార్గెట్ చేసింది. ఇప్పటికే టాప్-టైర్ స్పాన్సర్‌షిప్ ప్యాకేజీలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
