డేరా బాబాకు పెరోల్

డేరా బాబాకు పెరోల్

చండీగఢ్: లైంగిక దాడి, హత్య కేసులో ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు పెరోల్ లభించింది. రోహ్తక్ లోని సునారియా జైలులో ఉన్న డేరా బాబాకు మూడు వారాల పెరోల్ దక్కిందని ఓ జైలు అధికారి తెలిపారు. ఇంతకుముందు కూడా ఆయనకు పలుమార్లు పెరోల్ దక్కింది. తన తల్లిని కలుసుకునేందుకు గుర్మీత్ కు కొన్నిసార్లు ఎమర్జెన్సీ పెరోల్స్ ఇచ్చారు. అయితే అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే పెరోల్ దక్కగా.. ఈసారి మాత్రం ఏకంగా మూడు వారాల పాటు బయట ఉండేందుకు ఆయనకు అనుమతి దక్కింది. చట్టం ప్రకారం పెరోల్ ఇవ్వడం అనేది అందరూ ఖైదీల హక్కు అని.. అది డేరా చీఫ్ కూ వర్తిస్తుందని హరియాణా మంత్రి రంజిత్ సింగ్ అన్నారు. 

కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు డేరా బాబాకు పెరోల్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ స్థానాల్లో గుర్మీత్ ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఎలక్షన్లపై  గుర్మీత్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదని.. నిబంధనల ప్రకారమే పెరోల్ ఇచ్చారని తెలిపారు. ఇకపోతే, పెరోల్‌పై వస్తున్న డేరా బాబాకు పంజాబ్‌లోని 23 జిల్లాల్లో 300 డేరాలు ఉన్నాయి. ఈ డేరాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాయి. పంజాబ్‌లోని మజా, మాల్వా, దోబా ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పంజాబ్‌లోని దాదాపు 69 స్థానాల్లో ఆయన ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు

నో వర్క్ ఫ్రమ్ హోం.. ఆఫీసులకు రావాల్సిందే