నో వర్క్ ఫ్రమ్ హోం.. ఆఫీసులకు రావాల్సిందే

నో వర్క్ ఫ్రమ్ హోం..  ఆఫీసులకు రావాల్సిందే

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వ‌ర్క్‌ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమ‌వారం నుంచి అన్ని శాఖ‌ల ప్ర‌భుత్వ ఉద్యోగులు విధిగా కార్యాల‌యాల విధుల‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయి. సోమ‌వారం నుంచి ఉద్యోగులు విధిగా కార్యాల‌యాల విధుల‌కు హాజ‌ర‌వ్వాల‌ని, అయితే అంద‌రూ విధిగా మాస్క్ ధ‌రించాల‌ని ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు స్ప‌ష్టం చేశారు. మాస్క్‌తో పాటు క‌రోనా నియ‌మాల‌ను కూడా పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో కేంద్రం కరోనా నిబంధనలు సడలిస్తూ వస్తోంది. తాజాగా వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. సోమ‌వారం నుంచి అన్ని హోదాల వారు కార్యాల‌యాల్లో విధుల‌కు హాజ‌రవ్వాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యంపై కేంద్ర సిబ్బంది వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. క‌రోనా ప్ర‌భావం కాస్త త‌గ్గిన నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని జితేంద్ర సింగ్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో ఎలాంటి స‌డలింపులూ ఉండ‌వు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్ర‌క‌టించారు.

ఇవి కూడా చదవండి: 

కాషాయం కండువాలతో క్యాంపస్‌కు విద్యార్థులు

హిజాబ్ ధరించిన విద్యార్థులకు అనుమతి