హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. రోనాల్డ్ రోస్‌ను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కాగా, రోనాల్డ్ రోస్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ 2024 అక్టోబర్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DOPT) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో డీవోపీటీ ఉత్తర్వులను రోనాల్డ్ రోస్ క్యాట్‌లో సవాల్ చేశారు. స్థానికత ఆధారంగా రోనాల్డ్ రోస్‌ను క్యాట్ తెలంగాణకు అలాట్ చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేసింది. డీవోపీటీ అప్పీల్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈ మేరకు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ, తెలంగాణ విభజన సమయంలో ఐఏఎస్ రోనాల్డ్ రోస్‌ను డీవోపీటీ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు అలాట్ చేసింది. అయితే.. అప్పుడు క్యాట్‌ను ఆశ్రయించి పది సంవత్సరాల పాటు తెలంగాణలోనే విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఏపీకి అలాట్ అయ్యి తెలంగాణలోనే పని చేస్తోన్న ఐఏఎస్, ఐపీఎస్‌లను తిరిగి ఏపీకి వెళ్లాలని 2024లో డీవోపీటీ ఆదేశించింది.
డీవోపీటీ ఆదేశాలను రోనాల్డ్ రోస్ క్యాట్‌లో సవాల్ చేశారు. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్‌ను కోరారు. స్థానికత ఆధారంగా రోనాల్డ్ రోస్‌ను తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ అతడికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వులపై డీవోపీటీ మళ్లీ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో రోనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
