గుడ్ న్యూస్.. 13,155 బ్యాంక్​ జాబ్స్​

గుడ్ న్యూస్.. 13,155  బ్యాంక్​ జాబ్స్​

దేేశవ్యాప్తంగా ఉన్న 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ రీఓపెన్​ చేస్తూ ఐబీపీఎస్​ కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో  4500 లకు పైగా ఆఫీస్ అసిస్టెంట్, 3800 స్కేల్‌‌-I ఆఫీసర్, వెయ్యికి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలున్నాయి. మన రాష్ర్టంలో 470, ఏపీలో 320 జాబ్​లున్నాయి. అభ్యర్థులు అక్టోబర్‌‌ 26 నుంచి నవంబర్‌‌ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత; అసిస్టెంట్, జనరల్​ బ్యాంకింగ్ ఆఫీసర్‌‌‌‌కు బ్యాచిలర్​ డిగ్రీ ఉత్తీర్ణత. స్పెషలిస్ట్​ పోస్టులకు జాబ్​ను బట్టి అగ్రికల్చర్​, హార్టికల్చర్, ఫారెస్ర్టీ, ఎనిమల్​ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్​మెంట్​, లా, ఎకనామిక్స్​, అకౌంటెన్సీలో డిగ్రీ పాసైన వారు అర్హులు. మల్టీపర్పస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I కి ఎక్స్​పీరియన్స్ అవసరం లేదు. కానీ మిగిలిన పోస్టులకు ఒకటి నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.ప్రాంతీయ భాషపై అవగాహనతో పాటు కంప్యూటర్​ ప్రొఫీషియన్సీ తప్పనిసరి.

వయసు: 2020 నవంబర్​9 నాటికి ఆఫీస్​ అసిస్టెంట్​కు 18 నుంచి 28, స్కేల్​–I ఆఫీసర్​కు 18 – 30, స్కేల్​‌‌‌‌​–I​I కి 21–32, స్కేల్​​–III కి 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, పీడబ్ల్యూడీలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175

అప్లికేషన్​ ప్రాసెస్​: 26 అక్టోబర్​ 2020 నుంచి ఆన్​లైన్​లో..; చివరితేది: 9 నవంబర్​ 2020;

వెబ్​సైట్​; www.ibps.in

ప్రిలిమినరీ ఎగ్జామ్​: ఆఫీసర్​ స్కేల్​–I(31 డిసెంబర్​ 2020), ఆఫీసర్​ అసిస్టెంట్​ పోస్టులకు 2021 జనవరి 2,4 తేదీల్లో..

ఖాళీలు

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టి పర్పస్)            4624

ఆఫీసర్(అసిస్టెంట్ మేనేజర్)                3800

అగ్రికల్చర్ ఆఫీసర్                            100

మార్కెటింగ్ ఆఫీసర్                           8

ట్రెజరీ మేనేజర్                                 3

లా ఆఫీసర్                                     26

చార్టెడ్ అకౌంటెంట్                            26

ఐటీ ఆఫీసర్                                   58

జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్                  837

ఆఫీసర్ స్కేల్– III                           156

మొత్తం                                         9638

 ఇన్​స్టిట్యూట్​ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్​(ఐబీపీఎస్)  ఇప్పటికే1167 పీవో, మేనేజ్​మెంట్​ట్రెయినీ పోస్టులకు కామన్ రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్ లో నోటిఫికేషన్ రిలీజ్​చేసింది.. నియామక ప్రక్రియ కొనసాగుతుండగా.. దీనికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 3,517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌‌మెంట్ ట్రైయినీ పోస్టులు భర్తీకి అక్టోబర్ 28 నుంచి అప్లికేషన్స్​ మళ్లీ స్టార్ట్​ అయ్యాయి.

బ్యాంకుఖాళీలు 

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 2020 నవంబర్​11 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్​ సర్వీస్​మెన్​​లకు ఐదేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది.

దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో..​

అప్లికేషన్​ ప్రాసెస్ స్టార్ట్​​: 28 అక్టోబర్ 2020

చివరి తేదీ: 11 నవంబర్ 2020

ప్రిలిమినరీ ఎగ్జామ్: 2021 జనవరి 5 లేదా 6

కాల్ లెటర్; పరీక్షకు 10 రోజుల ముందు

వెబ్​సైట్: www.ibps.in

నోట్: 2020 ఆగస్టు 5 నుంచి 26 వరకు అప్లై చేసినవాళ్లు, అక్టోబర్‌‌ 3, 10, 11 తేదీల్లో జరిగిన ఐబీపీఎస్​ పీవో ప్రిలిమ్స్​2020 పరీక్షకు హాజరైన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 2020 నవంబర్ 11 నాటికి విద్యార్హతలు సాధించినవారు, 2020 ఆగస్ట్ 5 నాటికి రిజిస్టర్ చేసుకోలేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెలెక్షన్​ ప్రాసెస్​; ప్రిలిమినరీ, మెయిన్స్​, ఇంటర్వ్యూ మూడు దశల్లో సెలెక్షన్​ ఉంటుంది.

ప్రిలిమినరీ ఎగ్జామ్​; ప్రిలిమినరీ ఎగ్జామినేషన్​లో మొత్తం మూడు సెక్షన్లుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్​ నుంచి 30  ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్​ ఎబిలిటీ లో 35 ప్రశ్నలకు గాను 35 మార్కులు కేటాయించారు. అన్ని సెక్షన్లలో కలిపి మొత్తం 100 మార్కులు కేటాయించారు.  ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్​ మార్కింగ్ ఉంటుంది. ప్రతి సెక్షన్​కు 20 నిమిషాల సమయం ఉంటుంది. ఎగ్జామ్​ డ్యూరేషన్​ 60 నిమిషాలు. ప్రిలిమినరీలో కేటగిరీల వారీగా సెక్షనల్​ కటాఫ్​ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్​ కండక్ట్​ చేస్తారు.

మెయిన్స్​ ఎగ్జామ్​; దీనిలో మొత్తం ఐదు సెక్షన్లుంటాయి. రీజనింగ్​ & కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​ నుంచి 45 ప్రశ్నలకు గాను 60 మార్కులు కేటాయించారు. జనరల్​/ఎకానమి/బ్యాంకింగ్ అవేర్​నెస్​ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 35 ప్రశ్నలకు 40 మార్కులు, డేటా అనాలసిస్​ ​& ఇంటర్​ప్రెటేషన్​ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్​(లెటర్​ రైటింగ్​ & ఎస్సే) నుంచి 2 ప్రశ్నలకు గాను 25 మార్కులుంటాయి. మొత్తం మార్కులు 225.

ఇంటర్వ్యూ; మెయిన్స్​​ ఎగ్జామ్​లో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. దీనికి 100 మార్కులు. మెయిన్స్​, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్​ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

 స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​ రిక్రూట్మెంట్

కామన్​ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​లో భాగంగా 2021–22 ఇయర్​కు గాను స్పెషలిస్ట్​ ఆఫీసర్ల రిక్రూట్​మెంట్​కు ఐబీపీఎస్​ ప్రకటన విడుదల చేసింది.ఖాళీలపై అఫీషియల్​ వెబ్​సైట్​లో నోటిఫికేషన్​ వెల్లడించాల్సి ఉంది; పోస్టులు: ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్​ ఫీల్డ్​ ఆఫీసర్​, రాజ్​భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్​ఆర్​/పర్సనల్​ ఆఫీసర్​, మార్కెటింగ్​ ఆఫీసర్​ ; దరఖాస్తులు: ఆన్​లైన్​లో; అప్లికేషన్​ ప్రాసెస్​ ప్రారంభం: 2 నవంబర్​ 2020 ; చివరి తేది: 23 నవంబర్​ 2020 ; ప్రిలిమ్స్​ ​:  2020 డిసెంబర్​ 26, 27 తేదీల్లో.