ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌‌‌‌.. మూడో ర్యాంక్లో ఇండియా

 ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌‌‌‌.. మూడో ర్యాంక్లో ఇండియా

న్యూఢిల్లీ: ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌‌‌‌లో ఇండియా టెస్ట్‌‌‌‌ జట్టు స్థానం మెరుగైంది. శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో టీమిండియా ఒక్క ప్లేస్‌‌‌‌ మెరుగుపడి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఇండియా టీమ్‌‌‌‌ ఖాతాలో 104 రేటింగ్‌‌‌‌ పాయింట్లు ఉన్నాయి. గతేడాది మే నెల నుంచి ఆడిన అన్ని మ్యాచ్‌‌‌‌ల వెయిటేజిని పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ఈ ర్యాంక్‌‌‌‌లను ప్రకటించింది. 

ఆస్ట్రేలియా (131), సౌతాఫ్రికా (119) టాప్‌‌‌‌–2 ర్యాంక్‌‌‌‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ఇంగ్లండ్‌‌‌‌ (102) నాలుగో ర్యాంక్‌‌‌‌కు పడిపోయింది. న్యూజిలాండ్‌‌‌‌ (101), పాకిస్తాన్‌‌‌‌ (89), శ్రీలంక (86), వెస్టిండీస్‌‌‌‌ (68), బంగ్లాదేశ్‌‌‌‌ (67), ఐర్లాండ్‌‌‌‌ (25), జింబాబ్వే (10), అఫ్గానిస్తాన్‌‌‌‌ (0) వరుసగా ఐదు నుంచి 12 ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నాయి. విమెన్స్‌‌‌‌లోనూ ఆస్ట్రేలియా (163) ఆధిపత్యమే కొనసాగుతోంది.  ఇంగ్లండ్‌‌‌‌ (128), ఇండియా (124), సౌతాఫ్రికా (100), న్యూజిలాండ్‌‌‌‌ (93) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.