ముగ్గురు మొనగాళ్లు: ఐసీసీ ర్యాంకుల్లో భారత బ్యాటర్ల హవా

ముగ్గురు మొనగాళ్లు: ఐసీసీ ర్యాంకుల్లో భారత బ్యాటర్ల హవా

ప్రస్తుతం టీమిండియా బ్యాటర్ల జోరు మాములుగా లేదు. ముఖ్యంగా టాపార్డర్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ  ఆసియా కప్ లో అదరగొట్టేస్తున్నారు. ఈ క్రమంలో  ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో సత్తా చాటుతూ ఏకంగా టాప్-10 లో చోటు సంపాదించారు. తాజాగా విడుదల చేసిన  బ్యాటర్ల ర్యాకింగ్స్ లో  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 8 వ స్థానంలో, కెప్టెన్ రోహిత్ శర్మ 9 వ స్థానంలో, యంగ్ ప్లేయర్ గిల్ 2 వ స్థానంలో నిలిచారు.
 
కోహ్లీ 715 రేటింగ్ పాయింట్లతో,రోహిత్ కూడా 707 పాయింట్లతో చాలా రోజుల తర్వాత టాప్-10 లో చోటు సంపాదించగా.. గిల్ 759 పాయింట్లతో ఏకంగా రెండో స్థానంలో నిలిచాడు. 863 పాయింట్లతో   పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.  ఆసియా కప్ లో పాకిస్థాన్ పై విరాట్(122) సెంచరీ చేస్తే.. రోహిత్, గిల్ చెరో రెండు అర్ధ సెంచరీలతో తమ ఫామ్ ని కొనసాగిస్తున్నారు. బౌలింగ్ లో చివరి రెండు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ 5 స్థానాలను మెరుగుపర్చుకొని 7 వ స్థానంలో నిలిచాడు. ఇక హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ 9 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.