
టెస్ట్ క్రికెట్ లో సరికొత్త మార్పుకు ఐసీసీ శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. రెండంచెల టెస్ట్ ఫార్మాట్ (టు టైర్ సిస్టమ్) అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) మద్దతు ఇస్తున్న ప్రతిపాదనపై ఐసీసీ మెంబర్స్ ప్రధానంగా చర్చించే చాన్సుంది. గురువారం నుంచి జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వీటిపై కీలక చర్చ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఏజీఎంలో సభ్యులు క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలపై చర్చి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ ప్రతిపాదన ప్రకారం టెస్ట్ ఆడే దేశాలను రెండు వేర్వేరు విభాగాలుగా విభజిస్తారు. పెర్ఫామెన్స్ ఆధారంగా టీమ్స్ ప్రమోషన్, రిలెగేషన్ చేసి నిధుల కేటాయింపులపై ఐసీసీ ఏజీఎంలో నిబంధనలు రూపొందించే చాన్సుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతో ఈ కొత్త విధానానికి అమోదముద్ర పడితే 2027 తర్వాత అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
►ALSO READ | పొలంలో నాటు వేసిన రింకు సింగ్కు కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్
ఈ విధానం ప్రకారం 12 జట్లను ఆరు విభాగాలుగా విభజిస్తారు. మొదటి డివిజన్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ టైటిల్ విజేత సౌతాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక ఉందనున్నట్టు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం పాకిస్థాన్ డివిజన్ 2లో పడిపోనుంది. డివిజన్ 2లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్ ఉన్నాయి. 133 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ అతి పెద్ద మార్పు తీసుకొని రావాలంటే ఐసీసీలో ఉన్న 12 పూర్తి సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో పాకిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది.
Sad news 😢 for Pakistan cricket fan's
— 👑 BOBBY.. (@cricket746) July 21, 2025
When your board prefers to play T20 cricket over red-ball cricket then this thing happens 💔
ICC proposes two-tier Test cricket from 2027-29 and Pakistan is suggested to be included in Division 2.#BabarAzam𓃵 #PakistanCricket pic.twitter.com/FAMQ70OuqT