న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ షెఫాలీ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో షెఫాలీ (731) రెండు ప్లేస్‌లు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో హాఫ్ సెంచరీ చేయడం ఆమెకు కలిసొచ్చింది.
వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (762) ఒక్క ప్లేస్ దిగజారి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో స్మృతి 13, 12 రన్స్ మాత్రమే చేసింది. విండీస్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ (767) మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (639) రెండు ర్యాంక్‌లు మెరుగుపడి 11వ స్థానంలో నిలవగా, జెమీమా రోడ్రిగ్స్ (637) 14వ ర్యాంక్‌కు పడిపోయింది.
జార్జియా వోల్ (815), బెత్ మూనీ (788), హేలీ మాథ్యూస్ (767) టాప్–3లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ (705) రెండు స్థానాలు కిందకు దిగి ఐదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. రేణుకా సింగ్ (699) నాలుగు ప్లేస్‌లు, అరుంధతి రెడ్డి (665) మూడు ప్లేస్‌లు కోల్పోయి వరుసగా 9, 12వ ర్యాంక్‌ల్లో నిలిచారు. రాధా యాదవ్ (620) 20వ ర్యాంక్‌లో ఉంది.

