సెమీస్‌‌‌‌లో ఇండియా

సెమీస్‌‌‌‌లో ఇండియా

ఆంటిగ్వా: లాస్ట్‌‌ ఎడిషన్‌‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌‌ చేతిలో ఎదురైన ఓటమికి రివెంజ్‌‌ తీర్చుకున్న ఇండియా..  అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌లో సెమీఫైనల్‌‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో బౌలర్లు  రవి కుమార్ (3/14),  విక్కీ ఒస్త్వాల్ (2/25)తో  పాటు ఓపెనర్‌‌ రఘువన్షి (44) సత్తా చాటడంతో  ఇండియా 5  వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బంగ్లాను మన పేసర్లు వణికించారు. దాంతో  బంగ్లా  37.1 ఓవర్లలో111 రన్స్‌‌కే ఆలౌటైంది.  స్పిన్నర్ మెహెరోబ్(30), ఆషికర్ జమాన్ (16) ఎనిమిదో వికెట్‌‌కు 50 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో టీమ్​ స్కోరు 100 దాటించారు. 36వ ఓవర్లో వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో బంగ్లా ఇన్నింగ్స్‌‌ తొందరగానే ముగిసింది. అనంతరం ఛేజింగ్‌‌లో ఇండియా 30.5 ఓవర్లలో 11 7/5  స్కోరు చేసి గెలిచింది. సెకండ్‌‌ ఓవర్లోనే ఓపెనర్‌‌ హర్నూర్‌‌ (0) డకౌటైనా మరో ఓపెనర్‌‌ రఘువన్షి (44), షేక్‌‌ రషీద్‌‌ (26) రాణించారు. సెకండ్‌‌ వికెట్‌‌కు 70 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో విక్టరీకి రూట్‌‌ క్లియర్‌‌ చేశారు. అయితే, బంగ్లా బౌలర్‌‌ రిపొన్‌‌ (4/31) దెబ్బకు రఘువంశి, రషీద్‌‌తో పాటు సిద్దార్థ్‌‌ (6),  రాజ్‌‌ బవా (0) వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్‌‌లో టెన్షన్‌‌ మొదలైంది. అయితే, కెప్టెన్‌‌ యశ్‌‌ ధుల్‌‌ ( 20నాటౌట్‌‌),  కౌశల్‌‌ తాంబే (11 నాటౌట్‌‌) టీమ్​ను గెలిపించారు. బుధవారం జరిగే  సెమీస్​లో ఆసీస్​తో ఇండియా పోటీ పడనుంది.