
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ చైర్మన్ జైషా గురువారం (మే 15) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డబ్ల్యూటీసీ ఫ్రైజ్ మనీ వివరాలను వెల్లడించారు. ఐసీసీ మొత్తం 5.76 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 49.32 కోట్లు) నగదు బహుమతిని అనౌన్స్ చేసింది. ఇందులో డబ్ల్యూటీసీ విజేతగా నిలిచే జట్టుకు 30.78 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుండగా.. రన్నరప్‌కు 18.46 కోట్లు రూపాయల బహుమతి లభించనుంది.
డబ్ల్యూటీసీలో మూడో స్థానంతో సరిపెట్టుకున్న టీమిండియాకు 12.33 కోట్లు దక్కనున్నాయి. కాగా, 2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11న మొదలు కానుంది. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా, -సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. కాగా, డబ్ల్యూటీసీ తొలి రెండు ఎడిషన్లలో టీమిండియా ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఫస్ట్ ఎడిషన్‌లో తుదిపోరులో కంగారుల చేతిలో ఓటమి పాలు కాగా.. రెండో సీజన్లో ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. మూడో ఎడిషన్ల కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేక మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. 2025, జూన్ నెలలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్, ఇండియా టెస్ట్ సిరీస్‌తో డబ్ల్యూటీసీ ఫోర్త్ ఎడిషన్ మొదలు కానుంది.
WTC 2023-25లో ప్రతి జట్టు గెలుచుకున్న ప్రైజ్ మనీ విరాలు:
స్థానం జట్టు ప్రైజ్ మనీ రూ.లలో
విజేత ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా 30.82 కోట్లు
రన్నరప్ ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా 18.49 కోట్లు
మూడవది భారతదేశం 12.33 కోట్లు
నాల్గవది న్యూజిలాండ్ 10.28 కోట్లు
ఐదవది ఇంగ్లాండ్ 8.22 కోట్లు
ఆరవ శ్రీలంక 7.19 కోట్లు
ఏడవది బంగ్లాదేశ్ 6.17 కోట్లు
ఎనిమిదవది వెస్టిండీస్ 5.14 కోట్లు
తొమ్మిదవది పాకిస్తాన్ 4.11 కోట్లు
It's exciting to announce that the winner of the #WTC25 Final between South Africa and Australia will earn $3.6M, with the runner-up to receive $2.1M. The increase in prize money exhibits our efforts to prioritize Test cricket and build on momentum from previous WTC cycles. @ICC pic.twitter.com/GMgWxM7GSb
— Jay Shah (@JayShah) May 15, 2025