WTC 2025-27: మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పూర్తి షెడ్యూల్ ఇదే

WTC 2025-27: మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పూర్తి షెడ్యూల్ ఇదే

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2023-25 ముగిసింది. శనివారం (జూన్ 14) లార్డ్స్ లో ముగిసిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 27 ఏళ్ళ తర్వాత ఐసీసీ టైటిల్ అందుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ నాలుగో ఎడిషన్ పైనే ఉంది. ఈ సైకిల్ లో మొత్తం 71 టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆస్ట్రేలియా అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. టీమిండియా 18 మ్యాచ్ లు ఆడుతుంది. బంగ్లాదేశ్, శ్రీలంక 12 టెస్ట్ మ్యాచ్ లే ఆడనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.               

2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ నాలుగో ఎడిషన్ లో మొత్తం 9 జట్లు ఆడతాయి. జూన్ 17 నుండి గాలెలో జరగబోయే మొదటి టెస్ట్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ తో టెస్ట్ ఛాంపియన్ షిప్ నాలుగో ఎడిషన్ ప్రారంభమవుతుంది. రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన టీమిండియా శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో రానున్న టెస్ట్ సైకిల్ ను ఆడబోతుంది. తాజాగా టెస్ట్ సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా 2025 అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో ఈ ఎడిషన్ లో తమ తొలి సిరీస్‌ను ఆడనుంది. టాప్ 2 కి అర్హత సాధించిన జట్లు ఫైనల్ ఆడతాయి. ఫైనల్ వేదిక ఖరారు కావాల్సి ఉంది.   

ఐసీసీ WTC 2025-27 పూర్తి మ్యాచ్ షెడ్యూల్:

1)ఆస్ట్రేలియా- 22 టెస్టులు- ఇంగ్లాండ్ (5),న్యూజిలాండ్ (4),బంగ్లాదేశ్ (2),వెస్టిండీస్ (3),దక్షిణాఫ్రికా (3),ఇండియా (5)

2)బంగ్లాదేశ్- 12 టెస్టులు-    పాకిస్తాన్ (2),వెస్టిండీస్ (2),ఇంగ్లాండ్ (2),శ్రీలంక (2),దక్షిణాఫ్రికా (2),ఆస్ట్రేలియా (2)

3) ఇంగ్లాండ్-21 టెస్టులు-    ఇండియా (5), న్యూజిలాండ్ (3),పాకిస్తాన్ (3),ఆస్ట్రేలియా (5),దక్షిణాఫ్రికా (3),బంగ్లాదేశ్ (2)

4) ఇండియా -18 టెస్టులు- వెస్టిండీస్ (2),దక్షిణాఫ్రికా (2),ఆస్ట్రేలియా (5),ఇంగ్లాండ్ (5),శ్రీలంక (2),న్యూజిలాండ్ (2)

5)న్యూజిలాండ్  -16 టెస్టులు- వెస్టిండీస్ (3),ఇండియా (2), శ్రీలంక (2),ఇంగ్లాండ్ (3),ఆస్ట్రేలియా (4), పాకిస్తాన్ (2)

6) పాకిస్తాన్ -13 టెస్టులు- దక్షిణాఫ్రికా (2), శ్రీలంక (2), న్యూజిలాండ్ (2),బంగ్లాదేశ్ (2),వెస్టిండీస్ (2),ఇంగ్లాండ్ (3)

7) సౌతాఫ్రికా - 14 టెస్టులు - ఆస్ట్రేలియా (3),బంగ్లాదేశ్ (2),ఇంగ్లాండ్ (3),పాకిస్థాన్ (2),భారత్ (2),శ్రీలంక (2)

8) శ్రీలంక - 12 టెస్టులు- బంగ్లాదేశ్ (2),ఇండియా (2), సౌతాఫ్రికా (2),వెస్టిండీస్ (2), పాకిస్తాన్ (2),న్యూజిలాండ్ (2)

9) వెస్టిండీస్ - 14 టెస్టులు- ఆస్ట్రేలియా (3), శ్రీలంక (2), పాకిస్థాన్ (2),ఇండియా (2), న్యూజిలాండ్ (3),బంగ్లాదేశ్ (2)