
మధ్యప్రదేశ్: కరోనా నుంచి కోలుకున్న కొందరిలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ ఇబ్బంది పెడుతుండగా..దాని కంటే డేంజర్ వైట్ ఫంగస్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ రోగికి ఒకేసారి బ్లాక్, వైట్ ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ పేషెంట్ లో బ్లాక్, వైట్ ఫంగస్ వచ్చాయని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పేషెంట్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని..దేశంలో ఈ తరహా కేసు నమోదుకావడం ఇదే మొదటిసారి అని డాక్టర్లు చెప్పారు. ఈ కేసు నమోదైన 5 గంటల తర్వాత భోపాల్ కూడా ఈ తరహా కేసు నమోదైనట్లు తెలిపారు. కరోనాతోనే ఇబ్బంది పడుతున్న బాధితులు ..ఇప్పుడు బ్లాక్, వైట్ ఫంగస్ లతో భయాందోళన చెందుతున్నారు.