పిల్లల బుర్రకు పాాఠాలు ఎక్కాలంటే...

పిల్లల బుర్రకు పాాఠాలు ఎక్కాలంటే...

ఏదైనా విషయం అందరికీ ఒకేలా అర్థమవ్వాలని లేదు. వాళ్ల మైండ్‌‌సెట్‌‌ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం అవుతుంది. పిల్లల చదువు విషయంలోనూ అంతే. క్లాస్‌‌ రూమ్‌‌లో కూర్చున్న పిల్లల ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. అలాంటప్పుడు వాళ్లకు చెప్పే పాఠాలు అస్సలు బుర్రకెక్కవు. పిల్లల్ని ఆడించాలి. నవ్వించాలి. అప్పుడే వాళ్లకు చదువు మీద దృష్టి పెరుగుతుంది. చెప్పేది ఈజీగా మెదడుకు ఎక్కుతుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఏముందంటే.. ఒక గవర్నమెంట్‌‌ స్కూల్‌‌ హిందీ టీచర్‌‌‌‌ తన పిల్లలతో పాటలు పాడిస్తూ హిందీ గ్రామర్‌‌‌‌ చెప్తుంటాడు. కొందరు పిల్లలు డ్యాన్స్ చేస్తూ ‘ఆవో బచ్చో తుమ్హే దిఖాయే ఝాంకీ హిందుస్తాన్ కీ’ అనే హిందీ పాట పాడుతుంటారు. వాళ్ల వెనక నలుగురు పిల్లలు మెడలో ‘సంజ్ఞా, సర్వనామ్​, విశేషణ్​, క్రియా’అని రాసున్న బోర్డ్‌‌లు వేసుకొని ఉంటారు. అవి గ్రామర్‌‌‌‌లో ఎలా పని చేస్తాయో పాటలా పాడుతూ చెప్తుంటే, మిగిలిన పిల్లలు డాన్స్‌‌ చేస్తుంటారు. ఇవేకాకుండా మిగతా సబ్జెక్ట్‌‌ టీచర్లు కూడా పిల్లల్ని ఆడిస్తూనే చదువు చెప్తున్నారు ఆ స్కూల్‌‌లో. ఈ వీడియోని ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ అర్పిత్‌‌ వర్మ  తన ట్విట్టర్‌‌‌‌ అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేసాడు. ఈ వీడియోకి ఇప్పటికే 60వేల లైక్స్‌‌, 2 లక్షల వ్యూస్‌‌ వచ్చాయి. ఈ వీడియో చూసినవాళ్లంతా ‘బాగుంది. ఇలా చేస్తే పిల్లలకు చదువు పట్ల ఇష్టం పెరుగుతుంది. సబ్జెక్ట్‌‌ తొందరగా నేర్చుకుం టారు’, ‘ఇలాంటి చదువునే అన్ని స్కూల్స్‌‌లో ఇంప్లిమెంట్‌‌ చేయాల’ని కామెంట్స్‌‌ చేస్తున్నారు.