V6 News

ఒక్క మ్యాచ్‌లో ఫెయిలైతే తప్పిస్తారా?

ఒక్క మ్యాచ్‌లో ఫెయిలైతే తప్పిస్తారా?
న్యూఢిల్లీ: టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌లకు సంబంధించి టీమిండియా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లేయర్లలో అభద్రతాభావాన్ని కలిగిస్తోందని మాజీ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ అన్నాడు. ఒక టెస్ట్‌‌‌‌లో ఫెయిలైనంత మాత్రాన కీపర్​ సాహాను తప్పించిన మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌.. రాబోయే మ్యాచ్‌‌‌‌ల్లో పంత్‌‌‌‌ కూడా నిరాశపరిస్తే ఇదే నిర్ణయం తీసుకుంటుందా? అని ప్రశ్నించాడు. ‘సాహా ఒక మ్యాచే ఆడాడు. బాగా ఆడలేదు. అంతమాత్రానికే తప్పిస్తారా. ఒకవేళ పంత్‌‌‌‌ కూడా ఇలాగే ఆడితే ఏం జరుగుతుందో ఊహించండి. మళ్లీ అప్పుడు సాహాను తీసుకుంటారా? ఇదేం పద్ధతి. మా ప్లేస్‌‌‌‌లకు ఖాయమని ఏ ప్లేయర్‌‌‌‌కు భరోసా లేదు. కాబట్టే టీమ్‌‌‌‌ సెటిల్‌‌‌‌ కావడం లేదు. ప్రొఫెషనల్‌‌‌‌ స్పోర్ట్‌‌‌‌లో సెక్యూరిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కంట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరు టాలెంటెడే. వాళ్లకు కావాల్సిందల్లా సెక్యూరిటీ, హామీ. మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తే ఏ ప్లేయరైనా గాడిలో పడతాడు’ అని గౌతీ పేర్కొన్నాడు. For More News.. రాత పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్ విరాట్‌‌ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు పార్కింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు