ఆదుకోకపోతే.. ప్రకృతే ప్రభుత్వానికి బుద్ధి చెబుతుంది

ఆదుకోకపోతే.. ప్రకృతే ప్రభుత్వానికి బుద్ధి చెబుతుంది

-ఎమ్మెల్యే  జగ్గారెడ్డి 

హైదరాబాద్: భారీ వర్షాలు.. వరదలకు నష్టపోయిన రైతులను.. ప్రజలను.. ఆదుకోకపోతే ప్రకృతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన సర్కారు వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? అధికారులు ఉన్నారా లేరా? అని ప్రశ్నించారు. చీఫ్ సెక్రెటరీ పని తీరు  సరిగా లేదు.. వరదల్లో ప్రజలు ఎట్లా ఉన్నారు, పంట నష్టం వల్ల ప్రజలు ఎలా ఉన్నరోనని ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. పట్టణాలలో ఇండ్లలోకి వచ్చే నీరును ఎత్తి పోసుకోవడానికే సరిపోతోందని.. వర్షాల వల్ల హైదరాబాద్ లో జనాలకు నిద్ర హారాలు ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు రైతులు పత్తి వేశారు.. కౌలు కు తీసుకొని చాలా మంది రైతులు 5 నుండి 10 ఎకరాల వరకు పత్తి, వరి తదితర పంటలు వేశారు.. పంటలపై లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టారు… తీరా భారీ వర్షాలతో మొత్తం పంట నష్టపోయారని జగ్గారెడ్డి వివరించారు. పంట దెబ్బతిని నష్టపోయిన రైతులు విలవిలలాడుతుంటే.. సీఎం నుండి రైతులను ఆదుకుంటామనే ఒక్క మాట కూడా ఇంత వరకు రాలేదన్నారు. రైతులు పంట నష్టపోతుంటే సిఎస్ సోమేష్ కుమార్ ధరణి మీద రివ్యూ చేశారు.. ఇదా  పరిపాలనా అని ప్రశ్నించారు. అటు రైతులను.. ఇటు ప్రజలను ఆదుకోకపోతె ప్రకృతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. మా సంగారెడ్డి లో తిరుగుతుంటే జనం సమస్యలపై వెంటనే కలెక్టర్ కు ఫోన్ చేశా.. ఆయన  రివ్యూ మీటింగ్ లో ఉన్నారు.. ఈ సమయంలో ధరణి మీద సమీక్ష అవసరమా.. ? ప్రజల ఆస్తులు తెలుసుకోవడం అంత తొందర అవసరమా  అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు.

వర్షాలకు ఇండ్లు దెబ్బతింటే ఇండ్లు కట్టిస్తానని మర్చిపోయారా? – జగ్గారెడ్డి

వర్షాలకు ఇండ్లు దెబ్బతింటే ఇండ్లు కట్టిస్తానన్నారు.. ఇప్పుడేమో 10వేలు,50 వేలు లక్ష రూపాలు ఇస్తా అంటున్నారు.. ఆ డబ్బులు ఎలా సరిపోతాయి.. 5 లక్షల రూపాల ఇల్లు దెబ్బతింటే లక్ష ఇస్తే సరిపోతుందా.. మొత్తం 550 కోట్లు సరిపోతాయా..? మరి రైతుల పరిస్థితి ఏమిటి.. నగరలో ఉండే ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే 550 కోట్లు విడుదల చేసారు తప్ప ప్రజల మీద ప్రేమ లేదని జగ్గారెడ్డి విమర్శించారు. ఊరు కాలిపోయి ప్రజలు ఏడుస్తుంటే…ప్రభుత్వం ఏమో ఎదేదో చేస్తోంది.. రైతులు పంట పండించకపోతే ఏమి తింటారు..? అలాంటి రైతుల గురించి ఎందుకు ప్రభుత్వం మాట్లాడడం లేదు..? సీఎం, సీఎస్ వెంటనే రైతుల మీద రివ్యూ పెట్టాలి… రైతులను ఆదుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్ధిక మంత్రి ప్రజల సమస్యలు చూస్తాడా.. ? దుబ్బాకకు పోయి లక్ష మెజార్టీ కావాలాంటరా.. ? హైదరాబాద్ కు 10వేల కోట్లు కావాలి.. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆదుకోవాలంటే లక్ష కోట్లు కావాలి.. రైతులను,ప్రజలను అదుకోకపోతే రోడ్ల పైకి వచ్చి పోరాటం చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. లక్షల కోట్ల ప్రాజెక్టులు మెఘా. కృష్ణారెడ్డి కే ఇచ్చారు.. ఇతవరకు ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు.. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులను రీడిజెన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసింది మెగా కృష్ణా రెడ్డి అనేది అందరీ తెలుసు.. కేసీఆర్ బినామీ గా  మెగా కృష్ణ రెడ్డిమెగా కృష్ణ రెడ్డి 10 కోట్లు విరాళం ప్రభుత్వానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు జగ్గారెడ్డి. దక్షిణ భారతదేశంలోనే మెగా కృష్ణ రెడ్డి పెద్ద ధనవంతుడు.. 10 కోట్లు కాదు రాష్ట్రాన్ని దత్తత తీసుకో.. మెగా కృష్ణా రెడ్డి..  తెలంగాణ ప్రోజెక్టులతోనే కదా నువ్వు ధనవంతుడివి అయ్యావని అన్నారు.