సంగమేశ్వరం మొదలు పెట్టినట్లు తేలితే ఏపీ సీఎస్ జైలుకే

సంగమేశ్వరం మొదలు పెట్టినట్లు తేలితే ఏపీ సీఎస్ జైలుకే
  • రైతు వేసిన పిటిషన్​పై విచారణలో ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ హెచ్చరిక
  • ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వండి
  • కృష్ణా బోర్డు, పర్యావరణ శాఖకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశం
  • తదుపరి విచారణ జులై 12కు వాయిదా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తమ ఆదేశాలకు విరుద్ధంగా సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం పనులు మొదలు పెట్టినట్టు తేలితే ఏపీ ప్రభుత్వ చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీని జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాన్ని నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​(ఎన్జీటీ) హెచ్చరించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా పనులు చేపట్టవద్దని మరోసారి ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలను అతిక్రమించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందని నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌‌‌‌‌‌‌ జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణన్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌  సత్యగోపాల్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా విచారించారు.

పంపుహౌస్​ పనులు చేస్తున్నరు: పిటిషనర్
ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం కరోనా సెకండ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ సమయంలో ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున పనులు చేపట్టిందని పిటిషనర్‌‌‌‌‌‌‌‌  తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ శ్రావణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపించారు. భారీ మిషనరీని వర్క్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ పనులు చేస్తున్నారని తెలిపారు. ఎన్జీటీ ఇచ్చిన స్టేను అతిక్రమించి ఏపీ ప్రభుత్వం పనులు చేస్తున్నట్లు  తాము గతంలోనే పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశామన్నారు. అప్పుడు ఏపీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ప్రస్తుత చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సర్వే పనులు మాత్రమే చేస్తున్నట్లు  చెప్పారని పిటిషనర్​ తరఫు అడ్వకేట్​ గుర్తుచేశారు. పనులను కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ) పరిశీలించి ఎన్జీటీకి నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలు అమలుకాకుండా ఏపీ అడ్డుపడిందన్నారు. ఓసారి బోర్డు టీం సభ్యులపై తమకు నమ్మకం లేదని ఏపీ చెప్పిందని, మరోసారి కరోనాను సాకుగా చూపించిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి అని గతంలో ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా పేర్కొన్నా.. ఆ ఆదేశాలను ఏపీ ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిందన్నారు. తాము చేపడుతోంది కొత్త ప్రాజెక్టు కాదని, దీనికి పర్యావరణ అనుమతులే అవసరం లేదని కేంద్రానికి లేఖలు రాస్తూ పక్కదారి పట్టిస్తోందని ఎన్జీటీ బెంచ్​ దృష్టికి తెచ్చారు. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించిన వారికి మూడేండ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశముందన్నారు. ఎవరినో జైలుకు పంపాలన్నది తమ ఉద్దేశం కాదని, చట్టాన్ని ఏపీ గౌరవించడం లేదన్నది మాత్రమే ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసువస్తున్నట్లు తెలిపారు. 

పనులు చేపట్టడం లేదు: ఏపీ
ఏపీ అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ దొంతి మాధురిరెడ్డి వాదిస్తూ.. తాము రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడం లేదన్నారు. 2 వారాలు సమయమిస్తే కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. ఎన్జీటీ బెంచ్​ స్పందిస్తూ.. రాయలసీమ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీని, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు కాలేదని తేలితే ఏపీ సీఎస్‌‌ను  జైలుకు పంపుతామని చెప్తూ.. విచారణ జులై 12కు వాయిదా వేసింది.

తీర్పు అమలైతలే: తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ రామచందర్‌‌‌‌‌‌‌‌రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదన్నారు. చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఏపీ సర్కారుకు చట్టాలంటే గౌరవం లేదు: గవినోళ్ల శ్రీనివాస్​
ఏపీ ప్రభుత్వానికి చట్టాలంటే గౌరవం లేదని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దని గ్రీన్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ఆదేశించినా పట్టించుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామిక ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలనే సోయి కూడా ఏపీ సర్కారుకు లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ గ్రామం బాపన్‌‌‌‌‌‌‌‌పల్లికి కృష్ణా నది 30 కి.మీ.ల దూరమే ఉన్నా ఎప్పుడూ తమ భూములకు నీళ్లు రాలేదని చెప్పారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గతంలో తాము ఎంపీగా గెలిపించామని, పాలమూరు సహా దక్షిణ తెలంగాణ హక్కులు కాపాడేందుకు ఆయన ప్రయత్నించాలని గవినోళ్ల శ్రీనివాస్​ కోరారు.