గెలిపిస్తే.. అంబర్ పేటలో డ్రైనేజీ సిస్టమ్​ బాగు చేస్త : రోహిన్ రెడ్డి

గెలిపిస్తే.. అంబర్ పేటలో డ్రైనేజీ సిస్టమ్​ బాగు చేస్త :  రోహిన్ రెడ్డి

అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట, వెలుగు: తనను గెలిపిస్తే అంబర్ పేట సెగ్మెంట్​లో డ్రైనేజీ సిస్టమ్​ను బాగుచేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రోహిన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సెగ్మెంట్ పరిధిలోని శివాజీనగర్, కిశోర్ థియేటర్, రెడ్డి కాలేజీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏరియాల్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిని అక్కడి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబర్ పేట నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని రోహిన్ రెడ్డి మండిపడ్డారు. సెగ్మెంట్​లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ అధ్వానంగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలుచేస్తామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.