మూడు రోజులకు మించి ఈ లక్షణాలు ఉన్నాయా..

మూడు రోజులకు మించి ఈ లక్షణాలు ఉన్నాయా..

సికింద్రాబాద్, వెలుగు: కరోనా వార్తలతో జనంలో ఆందోళన మొదలైంది. జలుబు చేసినా, దగ్గుతున్నా, జ్వరంగా ఉన్నా ఆస్పత్రులకు పరుగు పెడుతున్నారు. జలుబు, దగ్గు , జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు 3 రోజులకు మించి ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని పేర్కొంటున్నారు. ఈ మేరకు డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు.

3 రోజులు జలుబు ఉంటే డాక్టర్‌ వద్దకెళ్లండి
‘‘పొడి దగ్గు , జలుబు, తలనొప్పితో మొదలై రెండు, మూడు రోజుల తర్వాత జ్వరం వస్తుందంటే ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. అందరికి దూరంగా ఉండి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బట్టలను వేడి నీటిలో మరిగించి శుభ్రం చేసుకోవాలి. వేడినీళ్లు తాగాలి. గోరువెచ్చటి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిముల్ని నాశనం చేయొచ్చు” అని ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్ రాము చెప్పారు.

హోమియో మందులతో ఈ వైరస్ రాదు
‘‘కరోనా వైరస్ కు హోమియోలో ప్రత్యేకంగా మందులు లేకున్నా.. లక్షణాలను బట్టి ‘ఆర్సానిక్ ఆల్బం’ బాగా పనిచేస్తది. ఈ వ్యాధి సోకిన వారు సైతం ఈ మందులు వాడితే ఈ వైరస్ పూర్తిగా నశిస్తుంది. ఈ మందులు ఎవరైనా వాడొచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు రోజూ 3 మాత్రలు, పెద్దవాళ్లు రోజూ ఆరు మాత్రలు 3 రోజులపాటు వేసుకుంటే సరిపోతుంది” అని డాక్టర్ మహేశ్వర్ రావు చెప్పారు.