ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి.. ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. "నవ్వితే హ్యాపీ.. నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి అందుకే నవ్వండి. నవ్వించండి నలుగురికీ మీ నవ్వును పంచండి. నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం" అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ.. పలువురు నేతలకు, ప్రతిపక్షాలకు కౌంటర్లు వేసే రోజా.. తాజాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజినీ కాంత్ పై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత చంద్రబాబును ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ చంద్రబాబు ని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా విమర్శించారు. రజనీకాంత్ ఏపీలో చేసిన కామెంట్స్ తో ఆయన జీరో అయిపోయారు అని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో రజినీ కాంత్ ఫ్యాన్స్, రోజాకు హెచ్చరికలు జారీ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.
https://twitter.com/RojaSelvamaniRK/status/1655079930731061249
