దళితబంధు రావాలంటే.. రెండు లక్షలు ఖర్చవుతయి

దళితబంధు రావాలంటే.. రెండు లక్షలు ఖర్చవుతయి
  • దళితబంధుకు బేరసారాలు
  • రూ. 2 లక్షలు ఖర్చవుతాయన్న ప్రజాప్రతినిధి భర్త
  • సోషల్​మీడియాలో వైరలైన ఆడియో

కమలాపూర్, వెలుగు: దళితబంధు స్కీం షురూ కాకముందే పైరవీలు స్టార్టయినయ్. హనుమకొండ జిల్లా కమలాపూర్​మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి భర్తతో  అదే గ్రామానికి చెందిన దళిత వ్యక్తి మాట్లాడిన ఫోన్​ఆడియో శుక్రవారం రాత్రి సోషల్​మీడియాలో వైరలైంది. ఆ ఆడియోలో రంజిత్​అనే వ్యక్తి ఓ ప్రజాప్రతినిధి భర్తతో మాట్లాడారు. ‘దండం పెడుతా.. కాళ్లు మొక్తుత.. సగం పైసలు తీస్కో కానీ నాకు దళితబంధు వచ్చేటట్లు చేయ్’ అంటూ అడిగారు. ప్రజాప్రతినిధి భర్త  సైతం సగం పైసలు నేనెందుకు తీస్కుంటగానీ లక్షో రెండు లక్షలో ఖర్చు అవుతాయ్ అని అన్నారు. ‘దండం పెడ్తా గుంట భూమి లేదు యాస్​ ఫర్​రికార్డు ప్రకారం నాకన్న ఇంకా దళితుడు ఎవ్వరూ ఉండకపోవచ్చు.. ప్లీజ్​ దయచేసి నాకు ఇప్పించు. అటూ ఇటు అని అంత పడ్డంకా నేను ఆడనో ఇడనో మాటిచ్చినంక నాకు ఇయ్యనని అనవు కదా’ అంటూ అవతలి వ్యక్తి అన్నారు. మామ ఫస్టు నువ్ తీసుకున్నంకనే నాకు ఇవ్వు అంటూ మాట్లాడిన సంభాషణ స్కీం అమలు తీరుపై కొత్త చర్చకు తెర తీసింది.