గెలిపిస్తే.. కడుపులో పెట్టుకుని చూస్కుంట : తోటకూర వజ్రేశ్​యాదవ్

 గెలిపిస్తే..  కడుపులో పెట్టుకుని చూస్కుంట : తోటకూర వజ్రేశ్​యాదవ్

ఘట్ కేసర్, వెలుగు: ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. కడుపులో పెట్టుకుని చూసుకుంటానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ తెలిపారు. మంగళవారం మేడ్చల్ సెగ్మెంట్​లోని కొండాపూర్, బాలాజీనగర్, అంబేద్కర్ నగర్, అంబేద్కర్ చౌరస్తా, ఎన్ ఎఫ్​సీలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లకు కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్​తో కలిసి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. స్థానికుడైన తనకు మేడ్చల్ వాసుల కష్టాలు తెలుసన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఘట్​కేసర్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్​ఎస్​యూఐ, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.