వేములవాడ, వెలుగు : వేములవాడ భీమేశ్వర స్వామివారిని మల్టీ జోన్ - 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి ఆలయ ఈఓ రమాదేవి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ, సిరిసిల్ల, డీఎస్పీలు శ్రీనివాస్, నాగేంద్రచారి ఉన్నారు.
