ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?

ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?

హైదారాబాద్: షాపింగ్‌కు వెళ్లి ఏదైనా వస్తువు కొంటే దానికి అదనంగా ప్యాకింగ్, క్యారీ బ్యాగ్ ఛార్జీలు వ్యాపారులు వసూలు చేయకూడదు. అందులోనూ మళ్లీ కంపెనీ లోగో ఉన్న క్యారీ బ్యాగ్స్ ఇచ్చినందుకు డబ్బులు తీసుకోవద్దు. హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ కంపెనీ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ కు రూ.20 వసూలు చేసినందుకు డిస్టిక్ కన్స్యూమర్ డిస్పూట్స్ కమిషన్ జరిమానా విధించింది. 

హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో ఓ వ్యక్తి రూ.816 లతో  కొన్ని వస్తువులు కొన్నాడు. బిల్ కట్టేటప్పుడు.. షాపింగ్ మాల్ సిబ్బంది అతని దగ్గర నుంచి కంపెనీ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ ఇచ్చినందుకు  రూ.20 తీసుకున్నారు. క్యారీ బ్యాగ్‌కు ఎక్స్ ట్రా డబ్బులు ఏంటి అని అతను షాపింగ్ మాల్ సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయంపై వ్యక్తి రంగారెడ్డి  జిల్లా వినియోగదారుల హక్కుల కమీషన్ ను ఆశ్రయించాడు. షాప్ కు వచ్చే కస్టమర్స్ కు మేము అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని ఉద్ధేశ్యంతోనే వారి లోగో క్యారీ బ్యాగ్ ఇవ్వాలని చెప్పింది. అంతేకాని వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదని డిస్టిక్ కన్స్యూమర్ డిస్పూట్స్ కమిషన్ హెచ్చరించింది.

అయితే బలవంతంగా ఐకియా లోగో ఉన్న క్యారీ బ్యాగ్ కొనిపించినందుకు  డిస్టిక్ కన్స్యూమర్ డిస్పూట్స్ కమిషన్ ఐకియాకు ఫైన్ వేసింది. ఐకియా స్టోర్ కస్టమర్ కు రూ.1,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు. వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించేందుకు కన్స్యూమర్ లీగల్ ఎయిడ్ అకౌంట్ లో ఐకియా స్టోర్‌కు రూ.5,000 డిపాజిట్ చేయాలని కమిషన్ కోరింది. ఏప్రిల్ 8 నుండి 45 రోజులలోపు కస్టమర్ కు రూ.1,000 నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే రూ.5,000పై సంవత్సరానికి 24శాతం వడ్డీ వేసి జరిమానా చెల్లించాలని కమిషన్ పేర్కొంది.