రాఖీ పండుగకు పోయి ..తుపాకులు పట్టుకొచ్చిండు

రాఖీ పండుగకు పోయి ..తుపాకులు పట్టుకొచ్చిండు
  • బిహార్​ వాసి అరెస్ట్    మూడు తుపాకులు​, 10 బుల్లెట్స్​ స్వాధీనం

ఎల్బీనగర్, వెలుగు: ఉపాధి కోసం హైదరాబాద్​కు వలస వచ్చిన ఓ బిహార్​వాసి అక్రమ​అయుధాల దందాకు తెర లేపాడు. స్వరాష్ట్రం నుంచి గన్స్​ తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నిస్తుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎల్బీ నగర్ లోని తన ఆఫీసులో గురువారం వెల్లడించారు. 

బిహార్ కు చెందిన శివకుమార్(32) ఉపాధి కోసం హైదరాబాద్​కు వచ్చాడు. మేడిపల్లిలోని గోదాంలో హమాలీగా పనిచేస్తూ చర్లపల్లిలో ఉంటున్నాడు. రాఖీ పండుగకు తన స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ బావమరిది కృష్ణ పాస్వాన్ తో కలిసి మూడు నాటు తుపాకులు, 10 బుల్లెట్లు తీసుకున్నాడు. వాటిని తీసుకుని శివకుమార్​ గురువారం చర్లపల్లి రైల్వేస్టేషన్​కు వచ్చాడు. విశ్వసనీయ సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్ఓటీ, చర్లపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మూడు తుపాకులు, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కృష్ణ పాశ్వాన్ ను త్వరలో అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు.