జీఓ190 ప్రకారమే డిప్యూటేషన్లు చేపట్టాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

జీఓ190 ప్రకారమే డిప్యూటేషన్లు చేపట్టాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  •     ఎమ్మెల్సీ మల్క కొమరయ్య  

హైదరాబాద్, వెలుగు: టీచర్ల డిప్యూటేషన్లు, తాత్కాలిక బదిలీలను జీఓ 190 ప్రకారమే జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, ఈ సమస్యను శాసన మండలిలో లేవనెత్తుతానని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన టీచర్లు ఆదివారం సికింద్రాబాద్‌‌‌‌లోని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యను వివరించారు. 

జీఓ 25 నిబంధనల ప్రకారం అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గతంలోనే ఈ విషయాన్ని సీఎస్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. రాబోయే శాసన మండలి సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు.