బిహార్ ఎన్నికల్లో.. రూ. 14వేల కోట్లు దారి మళ్లించారు.. జన్ సురాజ్ పార్టీ సంచలన కామెంట్స్

బిహార్ ఎన్నికల్లో.. రూ. 14వేల కోట్లు దారి మళ్లించారు.. జన్ సురాజ్ పార్టీ సంచలన కామెంట్స్

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలపై జన్​ సూరజ్​పార్టీ సంచలన కామెంట్స్​ చేసింది. బిహార్​ ఎన్నికల్లో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని ఆరోపించింది. వేల కోట్లు రూపాయలు బిహార్​ఎన్నికల్లో ఖర్చుచేశారని విమర్శించింది. ప్రపంచ బ్యాంకులు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎన్నికలకోసం ఖర్చు  చేసిందని తీవ్ర విమర్శలు చేసింది.  బీహార్ ఎన్నికల కోసం ప్రపంచ బ్యాంకు నిధులను దారి మళ్లించారని జన్ సురాజ్ ప్రతినిధి పవన్ వర్మ ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 

బిహార్​ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం  ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన నిధులను దుర్వినియోగం చేసిందని జన్​ సూరజ్​ పార్టీ నేత పవన్​ వర్మ సంచలన ఆరోపణలు  చేశారు. మహిళలను ఆకట్టు కునేందుకు దాదాపు 14 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను ఎన్నికల్లో ఖర్చు చేశారన్నారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్​ గార్​ యోజన కింద ఈ నిధులను మళ్లించారని రాష్ట్ర వ్యాప్తంగా 1.25 కోట్ల  మంది మహిళల ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున నేరుగా బదిలీ చేశారని వర్మ ఆరోపించారు. 

ప్రపంచ బ్యాంకు నుంచి మరో ప్రాజెక్టు కోసం అందుకున్న 21వేల కోట్ల నిధులలో రూ. 14వేల కోట్ల నిధులను ఎన్నికలకు ఖర్చు చేశారని అన్నారు. బిహార్​ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని.. రాష్ట్రం అప్పు రూ. 4.06 లక్షల కోట్లు చేరిందన్నారు.  రోజు వారీ వడ్డీలే 63 కోట్లు చెల్లిస్తున్నారని చెప్పారు. ఇంత భారాన్ని ఎలా భరించగలం అని ప్రశ్నించారు. 

ఎన్డీయే అధికారంలోకి రాకపోతే నిజంగా ఈ పథకం వాయిదా పడుతుందని మహిళలకు నగదు అందదని ఉద్దేశ్యపూర్వకంగానే పుకార్లు సృష్టించారని వర్మ ఆరోపించారు. సుమారు 4 కోట్ల మంది మహిళ ఓటర్లలో 1.25 కోట్ల మందికే ఈనగదు బదిలీ జరిగింది.. ఎన్డీయేకు ఓటు వేస్తే భవిష్యత్తులో ఈ పథకం ఆగిపోతుందని మిగిలిన మహిళా ఓటర్లు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. 

బిహార్​ ఇదీ జరిగింది..

ఓ పక్క మోడీ ఉచితాలను విమర్శిస్తూనే.. బిహార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ప్రకటించిన ఉచితాల మద్య వ్యత్యాసాన్ని వర్మ హైలైట్ చేశారు . గివ్​ అవేలకు వ్యతిరేకంగా ఢిల్లీ ఎన్నికల్లో మాట్లాడిన మోదీ..బిహార్ లో మాత్రం ఎందుకు నగదు బదిలీ చేశారని విమర్శించారు. ఇది రాజకీయ లబ్దికోసం  చేసిన ప్రీబీ కాదా ప్రశ్నించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఓటర్లు ను ప్రభావితం చేసేందుకు మోదీ బిహార్​ లో నగదు బదిలీ చేశారని వర్మ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికలను దెబ్బతీస్తాయని వాదించారు. 

ఎన్నికల్లో జన్​ సూరజ్​ పార్టీ ఓటమిపై స్పందించిన వర్మ.. జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు.మద్య పాన నిషేధం రద్దు చేస్తానని ప్రశాంత్ కిషోర్​ చెప్పడం వల్లే పార్టీ అవకాశాలను దెబ్బతీసిందన్న వర్మ తోసిపుచ్చారు.