ఆరు నెలల్లో.. అంబానీ కంపెనీల్లో లక్షా 60 వేల మంది ఉద్యోగులు రాజీనామా..

ఆరు నెలల్లో.. అంబానీ కంపెనీల్లో లక్షా 60 వేల మంది ఉద్యోగులు రాజీనామా..

2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో ఉద్యోగులు భారీ సంఖ్యలో రాజీనామా చేశారు. దాదాపు 41 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు రిలయన్స్ జియో వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతకుముందు సంవత్సరం (FY22)తో పోలిస్తే అట్రిషన్ రేట్లు 64.8 శాతం పెరిగాయి. మరోవైపు రిలయన్స్ రిటైల్ విభాగంలో 119,229 మంది ఉద్యోగులు  రాజీనామా చేశారు. 


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 2022-23లో రిటైల్, టెలికాం విభాగాల్లో స్వచ్ఛందంగా కంపెనీని వదిలిపోతున్న ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జియోలో 41,000 మందికి పైగా ఉద్యోగులు , రిలయన్స్ రిటైల్‌లో 1 లక్ష మందికి పైగా ఉద్యోగులు కంపెనీలకు రాజీనామా చేశారు.వార్షిక నివేదికల ప్రకారం.. అంతకుముందు సంవత్సరం (FY22)తో పోలిస్తే అట్రిషన్ రేట్లు 64.8 శాతం పెరిగాయి.


"RIL రిటైల్ విభాగంలో పెరిగిన కొనుగోళ్లతో పనిభారం పెరిగింది. దీంతో కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు ఇతర బాధ్యతలను చేపట్టాలని నిర్ణయించుకున్నా.. మరికొంత మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టేందుకు నిర్ణయించుకున్నారని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. 

మొత్తంగా..FY23లో RIL నుంచి 167,391 మంది ఉద్యోగులు  వైదొలగాలని నిర్ణయించుకున్నారు. రిటైల్ విభాగం నుంచి 119,229 ఉద్యోగులు , జియో నుంచి 41,818 ఉద్యోగులు జూనియర్ నుంచి మిడ్-మేనేజ్‌మెంట్ స్థాయిలలో ఉద్యోగులు రాజీనామా చేసినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.