హింటాస్టికా జడ్చర్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

హింటాస్టికా జడ్చర్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హోమ్ అప్లియెన్సెస్ కంపెనీ హిండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్రెంచ్ కంపెనీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అట్లాంటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హింటాస్టికా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్చర్లలో నిర్మించిన తమ మాన్యుఫాక్చరింగ్  ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటర్ హీటర్లను తయారు చేస్తారు. ఈ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కోసం రూ.210 కోట్లను  హింటాస్టికా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాటర్ హీటర్లను అమ్మడంతో పాటు,  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు కూడా చేపట్టాలని ఈ కంపెనీ చూస్తోంది. ‘మొత్తం 5.7 ఎకరాల్లో, రూ.210 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించాం.

ఈ ప్లాంట్  కెపాసిటీ ఏడాదికి ఆరు లక్షల వాHటర్ హీటర్లు. వాటర్ హీటర్లు, గ్రీజర్లు వంటి హీటింగ్ అప్లియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దేశంలో ఏడాదికి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 500 ఉద్యోగాలను క్రియేట్ చేస్తాయి. జడ్చర్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పర్యావరణానికి అనుకూలంగా నిర్మించాం’ అని హిండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్ ఇన్నోవేషన్ చైర్మన్ సందీప్ సోమాని అన్నారు. 2031–32 ఆర్థిక సంవత్సరం నాటికి  దేశంలో వాటర్ హీటర్ మార్కెట్ ప్రస్తుతం ఉన్న రూ.2,300 కోట్ల నుంచి రూ.6,100 కోట్లకు పెరుగుతుందని అంచనావేశారు. డిమాండ్ బాగుంటే మరో రూ.110 కోట్లతో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరిస్తామని వివరించారు. ‘పదేళ్ల క్రితం మేము కలిశాం. ఇప్పుడు తమ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లడం ఆనందంగా ఉంది. ఇరు గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఒకే ఇండస్ట్రియల్ విలువలను కలిగి ఉన్నాయి. ఇండియా వంటి పెద్ద దేశంలో సక్సెస్ అవ్వాలంటే హిండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ లాంటి స్ట్రాంగ్ లోకల్ కంపెనీతో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్  అవసరం’ అని గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అట్లాంటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ పియరీ లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంకోయిస్ అన్నారు.