ఇన్‌కమ్ టాక్స్‌ ఎత్తేస్తే అవినీతి తగ్గుతుంది

ఇన్‌కమ్ టాక్స్‌ ఎత్తేస్తే అవినీతి తగ్గుతుంది

దేశంలో అవినీతి తగ్గాలంటే ఇన్ కమ్ టాక్స్ ను రద్దు చేయాలన్నారు రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఆదాయపు పన్నును రద్దు చేయడం వల్ల దేశ జీడీపీ(స్థూల దేశీయ ఉత్పత్తి) కూడా పెరుగుతుందని చెప్పారు. నగరంలోని సోమాజిగూడ పార్క్ హోటల్ లో  ప్రజ్ఞా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ఇండియా ఆన్ ఎకనామిక్ సూపర్ పవర్ 2030 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్రమణ్య స్వామి.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు.

పీవీకి భారతరత్న కోసం పోరాడుతా

కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రీ పామ్స్ కు ఆద్యుడని, ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఒక్క శాతం ఉన్న GDP ని 8 శాతానికి తీసుకువెళ్లారని ఆయన చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని , ప్రభుత్వాలు ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అర్థం కావడం లేదన్నారు. పీవీకి భారతరత్న కోసం పోరాడుతానని చెప్పారు.

income-tax-must-be-abolished-if-gdp-growth-is-increased-says-mp-subramanian-swamy