భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి

భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి

ప్రభాస్‌‌‌‌‌‌‌‌ నటిస్తున్న  ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్‌‌‌‌‌‌‌‌ మూవీ ‘కల్కి 2898 ఎడి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌‌‌‌‌‌‌‌ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తోంది.  జూన్‌‌‌‌‌‌‌‌ 27న పాన్ వరల్డ్‌‌‌‌‌‌‌‌ మూవీగా విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.  మన జీవితంలోకి ఓ స్పెషల్ వ్యక్తి రాబోతుందని ఇటీవల ప్రభాస్ చేసిన ఇన్‌‌‌‌‌‌‌‌స్టా పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యక్తిని ‘ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 4 : బిల్డింగ్ ఎ సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్’ పేరుతో  కల్కి టీమ్ పరిచయం చేస్తూ ఓ వీడియోను  రిలీజ్ చేసింది.

ఇందులో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తుంటారు.  ఈ బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేష్​  వాయిస్ ఓవర్ ఇచ్చింది. ‘నా లైఫ్‌‌‌‌‌‌‌‌ ఏంటీ..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా’ అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇస్తాడు.. ‘నీ టైమ్‌‌‌‌‌‌‌‌ మొదలైంది బుజ్జి’ అంటూ తన వాహనం గురించి చెప్పబోతాడు. భైరవ పాత్ర పోషిస్తున్న ప్రభాస్‌‌‌‌‌‌‌‌కు బుజ్జి బెస్ట్ ఫ్రెండ్ అని రివీల్ చేశారు.

అయితే బుజ్జి గురించి మరింతగా తెలుసుకోవాలంటే మే 22 వరకు వెయిట్ చేయాల్సిందేనని ట్విస్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి స్టార్స్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్రలు పోషించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.