న్యూఢిల్లీ: ఇండియా టాప్ షట్లర్లు సుకాంత్ కడమ్, తరుణ్, సుహాస్.. పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించారు. మెన్స్ ఎస్‌ఎల్–4 కేటగిరీలో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. అయితే సుకాంత్ మెగా గేమ్స్‌కు క్వాలిఫై కావడం ఇదే మొదటిసారి. విమెన్స్ ఎస్‌ఎల్–3లో మన్‌దీప్ కౌర్ పోటీపడనుంది. విమెన్స్ డబుల్స్ ఎస్‌ఎల్–6లో నిత్య–శివరాజన్ పారాలింపిక్స్ బెర్త్‌లు దక్కాయి.
ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారాలింపిక్స్ జరగనున్నాయి. గత కొన్నేళ్ల నుంచి నిలకడగా రాణిస్తున్న సుకాంత్ ఈసారి మెడల్ సాధిస్తాడని ఆశిస్తున్నారు. ఆసియా పారా గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ నెగ్గడం ద్వారా మెగా గేమ్స్‌కు అర్హత సాధించాడు.
