కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌కు ఆదేశం

కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌కు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పోలింగ్ రోజు బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. ‘‘తెలంగాణ తెచ్చిన పార్టీకే తాను ఓటు వేశాను”అని పోలింగ్ రోజు మీడియాతో కేటీఆర్ మాట్లాడారంటూ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం నిరంజన్ చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్‌‌‌‌ను ఈసీ అడిషనల్ సీఈవో లోకేశ్‌‌ కుమార్ ఆదేశించారు. అనంతరం ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాలని చెప్పారు.