చలికాలంలో స్కిన్ కేర్ ఉత్పత్తులకు పెరిగిన క్రేజ్

చలికాలంలో స్కిన్ కేర్ ఉత్పత్తులకు పెరిగిన క్రేజ్

ట్రెండ్ కు తగ్గట్టుగా యూత్ అంతా ఫ్యాషన్స్ ఫాలో అవుతున్నారు. సీజన్ మారుతున్నప్పుడల్లా బ్యూటీ కేర్ పైనా ఫోకస్ చేస్తుంటారు. ప్రస్తుతం వాతావరణం మారడంతో వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తులకు క్రేజ్ పెరుగుతోంది. బ్యూటీ బ్రాండ్స్ కూడా సీజనల్ స్కిన్ కేర్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. 

వింటర్ లో వెదర్ చల్లగా ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఆ తరువాతే చర్మం పొడిబారుతుంది. డ్రై, ఆయిల్, నార్మల్ స్కిన్ ... ఇలా ఏ స్కిన్ టైప్స్ వారికైనా చలికాలం తిప్పలు తప్పవు. అందుకే సీజన్ కి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు సిటీ జనం. దీంతో వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. 

సిటీ మార్కెట్లో సీజన్ కి తగ్గట్టుగా కాస్మొటిక్స్ వస్తున్నాయి. నెలకో కంపెనీ కొత్త ఉత్పత్తులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. వింటర్ కోసం బాడీ లోషన్స్, సోప్స్, ఇతర కాస్మోటిక్స్ కి డిమాండ్ పెరిగింది. హెయిర్ కేర్ కోసం హెర్బల్ ఉత్పత్తుల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు.  

కొన్నేళ్ళ క్రితం దాకా చలి కాలంలో ఇంట్లో వస్తువులతోనే స్కిన్ కేర్ చూసుకునే వారు. వింటర్ లో స్కిన్ క్రాక్స్ రాకుండా, డ్రై కాకుండా సున్నిపిండి లాంటివి వాడేవారు. ఆయుర్వేద ఉత్పత్తులు కూడా ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మల్టీ నేషనల్ కంపెనీలు కొత్త కొత్త స్కిన్ కేర్, కాస్మోటిక్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ సీజన్లోనే మార్కెట్ 10 టూ 15 పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుందని వ్యాపారుల అంచనా. మగవాళ్ళు కూడా ఆడవాళ్లతో సమానంగా చర్మ సౌందర్యంపై శ్రద్ద పెట్టడంతో స్కిన్ కేర్, కాస్మోటిక్ సేల్స్ పెరుగుతున్నాయి. 

హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఎప్పుడూ ఉద్యోగాలు, పనులతో బిజీగా ఉంటారు. దాంతో ఇంట్లో నేచురల్ ప్రాడక్ట్స్ తయారు చేసుకునే టైం లేక రెడీమెడ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కెమికల్స్ తక్కువగా ఉండి ఆర్గానిక్, ఫ్రూట్ బేస్డ్ ప్రాడక్ట్స్ వాడాలంటున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లు. మేకప్, లిప్ స్టిక్స్ లో మాయిశ్చరైజర్ ఉండే ప్రాడక్ట్స్ వాడాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం వింటర్ సీజన్ కోసం స్కిన్, హెయిర్ కేర్ హైడ్రేట్ చేసే ఉత్పత్తుల కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు. మొన్నటి దాక కరోనా లాక్ డైన్ వల్ల డల్ గా ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్.. వింటర్ సీజన్ తో ఇప్పుడు పుంజుకుంటోంది.