భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర

భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర

కరోనా వైరస్ పై కీలక నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. వైరస్‌ ను కట్టడి చేసేందుకు ఫ్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచింది.  రూ.10 ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రద్దీ ఎక్కువగా ఉండి, అధిక ఆదాయం వచ్చే స్టేషన్లలో  50 రూపాయలకు పెంచగా,  10 మిలియన్ల ప్రజల కంటే తక్కువగా ఉండే స్టేషన్లలో రూ.20 కు పెంచుతున్నట్లు ప్రకటించింది.  మొత్తం 583 రైల్వే స్టేషన్లలో టికెట్ల ధర పెంపు వర్తిస్తుందని చెప్పింది.

అందులో 499 స్టేషన్ల ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.20 కాగా,  మిగిలిన 84 స్టేషన్లలో రూ.50 కు పెంచింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.  కరోనాను అరికట్టడంలో భాగంగా… ప్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే స్పష్టం చేసింది.

సాధారణంగా పండుగల సమయాల్లో మాత్రమే రైల్వే శాఖ ప్లాట్‌ ఫాం టికెట్ ధరను పెంచుతుంది. లేటెస్టుగా కరోనా వైరస్ ను కట్టడి చేసుందుకు పెంచింది.