సక్సెస్ తో బాధ్యత పెరుగుతుంది: ప్రభాస్

సక్సెస్ తో బాధ్యత పెరుగుతుంది: ప్రభాస్

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నసాహోవిడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హీరో ప్రభాస్ సినిమా విశేషాలను ఇలా పంచుకున్నారు

  • అందరూ హాలీవుడ్‌‌ సినిమాలా తీయాలనుకున్నారా అని అడుగుతున్నారు. నిజానికి మాకు అలాంటి ఆలోచనేమీ లేదు. సినిమా కోసం వాడిన వెపన్స్, డ్రెస్సెస్, సెట్స్ ఏవీ కూడా హాలీవుడ్ సినిమాలను అనుసరించి చేయలేదు. ఈ సినిమాకి పని చేసినవాళ్లలో చాలామంది హాలీవుడ్‌‌కి సంబంధించినవాళ్లు. కాబట్టి మీకు ఆ రేంజ్‌‌లో కనిపించొచ్చు.
  • ‘బాహుబలి’ లాగా ఇది పెద్ద స్టోరీ కాదు. కానీ స్క్రీన్​ప్లే బాగుంటుంది. ఈ సినిమాకి కథే మాస్టర్. సుజీత్ వయసుకీ అతను ఈ సినిమా తీసిన విధానానికీ అసలు సంబంధమే ఉండదు. నిజానికి నేను ‘బాహుబలి’ తర్వాత యాక్షన్ సినిమా చేయకూడదనుకున్నా. అందుకే దీన్ని మొదట లవ్ స్టోరీగానే అనుకున్నాం. కానీ సుజీత్ డెవెలప్ చేసుకుంటే వెళ్లే క్రమంలో ఇలా తయారయ్యింది.
  • విజువల్స్ అన్నీ నేచురల్‌‌గా ఉండాలని టెక్నికల్‌‌గా చాలా కష్టపడ్డాం. యాక్షన్​లో కొత్తదనాన్ని చూపించడం కోసం ప్రయత్నించాం. వాటన్నిటినీ స్క్రీన్‌‌ మీద చూస్తుంటే మేము పెట్టిన ఎఫర్ట్  కూడా బాగా వచ్చాయనిపించింది. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది కేవలం యాక్షన్ మూవీ కాదు. యాక్షన్ కంటే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైట్స్, యాక్షన్ సీన్స్ అన్నీ సందర్భాన్ని బట్టి ఉంటాయి తప్ప అదే పనిగా కనిపించవు. రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అన్ని తరగతుల వాళ్లూ చూడొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చెయ్యొచ్చు. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు  ఈ సినిమాని.
  • యాక్షన్ సీన్స్ టిపికల్‌‌గానే ఉన్నా  నాకేమీ దెబ్బలు తగల్లేదు. ఆ విషయంలో ఫైట్ మాస్టర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సేఫ్టీ కోసం ముగ్గురు నలుగురు ఉండేవాళ్లు. ఐదారేళ్ల క్రితం డూపులుండేవాళ్లు. ఇప్పుడు తక్కువైపోయారు.
  • మిగతా భాషల్లోనూ రిలీజవుతున్నా నా దృష్టిలో ఇది తెలుగు సినిమానే. ఎందుకంటే నేను తెలుగువాడినే. కథ తెలుగుదే. డైరెక్టర్ కూడా తెలుగువాడే. అందుకే నాకేమీ కొత్తగా అనిపించలేదు.
  • బడ్జెట్ గురించి మాట్లాడటం నా పని కాదు. కానీ బడ్జెట్ పెరుగుతుంటే నిద్ర పట్టదు. మిర్చి సినిమా రిలీజై గుడ్ టాక్ వచ్చేంత వరకూ నిద్ర పట్టలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. బహుశా ‘బాహుబలి’ క్రేజ్ తర్వాత ఆడియెన్స్‌‌ని ఎలా కన్విన్స్ చెయ్యాలో అనే భయంతోనేమో.. బడ్జెట్ పెరిగినా మంచి సినిమా తియ్యాలనుకున్నాం.
  • బాలీవుడ్‌‌ కాని, మాలీవుడ్‌‌ కాని… ఎక్కడికెళ్లినా నాకు మంచి స్వాగతం లభిస్తోంది. ఇక్కడ కూడా ఆడియో రిలీజప్పుడు ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి నా మనసు పులకించిపోయింది. ‘బాహుబలి’ తర్వాత ప్రతి భాషలో కూడా నాకు ఫాలోయింగ్ పెరిగింది. కుదిరితే తమిళంలోనూ నేనే డబ్బింగ్ చెబుతా.
  • సక్సెస్ పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుంది. సినిమాపై ప్రేమ పెరుగుతుం ది. ఇంకా ఇంకా సినిమాలు తీయాలన్న కోరిక కలుగుతుంది. కానీ నేను మాత్రం ముందుకంటే ఇప్పుడు ఎక్కువ స్ర్టెస్ పీలవుతున్నా.
  • తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. కేజీఎఫ్‌‌ డైరెక్టర్‌‌‌‌తో సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. దాని విషయంలో ఇంకా ఏమీ అనుకోలేదు. కొరటాల శివగారితో తప్పకుండా ఓ సినిమా చేస్తా.  బహుశా నా నెక్ట్స్​ సినిమా అదే అవుతుందేమో..

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి