పేసర్లు అదుర్స్‌: ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో  ఇంగ్లండ్‌‌ 183 ఆలౌట్‌‌

V6 Velugu Posted on Aug 05, 2021

నాటింగ్‌‌హమ్‌‌: ఇంగ్లండ్‌‌తో టెస్ట్‌‌ సిరీస్‌‌ను టీమిండియా అద్భుతంగా స్టార్ట్‌‌ చేసింది. పేసర్లంతా అదరగొట్టడంతో ఫస్ట్‌‌ టెస్ట్‌‌ తొలి రోజు పూర్తి ఆధిపత్యం చూపెట్టింది.  ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా బుధవారం మొదలైన ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 65.4 ఓవర్లు ఆడి 183కే ఆలౌటైంది. కెప్టెన్‌‌ జో రూట్‌‌(64) హాఫ్‌‌ సెంచరీ చేసి టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచాడు.  నలుగురు బ్యాట్స్‌‌మెన్‌‌ డకౌట్‌‌ అయ్యారు. ఇండియా బౌలర్లలో జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా(4/46) నాలుగు,  షమీ(3/28) మూడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు.  శార్దూల్‌‌ ఠాకూర్‌‌(2/41) రెండు వికెట్లు తీయగా.. సిరాజ్‌‌కు ఓ వికెట్‌‌ దక్కింది.  నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన ఇండియా ప్లాన్‌‌ సూపర్‌‌ సక్సెస్‌‌ అయ్యింది. పిచ్‌‌, కండీషన్స్‌‌ను సద్వినియోగం చేసుకున్న పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి హోమ్‌‌ టీమ్‌‌ను ఒత్తిడిలోనే ఉంచారు. ముఖ్యంగా లాస్ట్‌‌ సెషన్‌‌లో మరింత రెచ్చిపోయారు. దాంతో, 138/4తోటీ బ్రేక్‌‌కు వెళ్లిన ఇంగ్లండ్‌‌...మిగిలిన ఆరు వికెట్లను 45 రన్స్‌‌ తేడాలో కోల్పోయింది.అనంతరం ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌ మొదలుపెట్టిన ఇండియా.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 రన్స్‌‌ చేసింది.ఓపెనర్లు  రోహిత్‌‌ శర్మ(9 బ్యాటింగ్‌‌), కేఎల్‌‌ రాహుల్‌‌(9 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్‌‌ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌:  65.4 ఓవర్లలో183 ఆలౌట్‌‌ (రూట్‌‌ 64, బెయిర్‌‌స్టో 29, బుమ్రా 4/46, మహ్మద్​ షమీ 3/28) ఇండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌:13 ఓవర్లలో 21/0 (రోహిత్‌‌ 9 బ్యాటింగ్​, రాహుల్‌‌ 9 బ్యాటింగ్).

Tagged Test Cricket, Bumrah, shami, , IND vs ENG

Latest Videos

Subscribe Now

More News