IND vs ENG: ఇంగ్లాండ్ జట్టుకు మరో దెబ్బ.. స్వదేశానికి వెళ్ళిపోయిన యువ బౌలర్

IND vs ENG: ఇంగ్లాండ్ జట్టుకు మరో దెబ్బ.. స్వదేశానికి వెళ్ళిపోయిన యువ బౌలర్

వీసా జారీ జాప్యం కారణంగా అబుదాబిలో ఉండిపోయిన ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్.. బ్రిటన్‌ తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతను తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)అధికారులు, భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారని.. రాబోయే 24 గంటల్లో పరిష్కారం లభిస్తుందని నివేధికలు వచ్చినప్పటికి సమస్య పరిష్కారం కాకపోవడం ఎందుకనేది తెలియరాలేదు.

పాకిస్తాన్ వారసత్వానికి చెందిన 20 ఏళ్ల బ్రిటీష్ ముస్లిం అయిన బషీర్.. గత నెల రోజులుగా భారత వీసా కోసం కష్టపడుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు ఇండియా పర్యటన కోసం భారత్‌కు బయలుదేరే ముందు వరకూ అతను ఇంగ్లండ్ టెస్ట్ జట్టుతో శిక్షణ శిబిరంలోనే ఉన్నాడు. అయితే, చివరి నిమిషంలో వీసా జారీ ఆల‌స్యం కావ‌డంతో అతను లేకుండానే ఇంగ్లాండ్ జట్టు.. ఇండియాకు పయనమైంది. అతను అబుదాబిలో ఉండిపోయాడు. 

నివేదికల ప్రకారం, సోహైబ్ బషీర్ వీసా సమస్యను పరిష్కరించడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిందని, త్వరగతిన పరిష్కారం లభించకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చేయమని కబురు పంపినట్లు తెలుస్తోంది అతను యూకే చేరుకున్నాక.. ఈ విషయంపై నేరుగా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించమని కోరినట్లు సమాచారం. పాకిస్థాన్ వారసత్వం కలిగిన ఉన్నందునే అతని ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. గతేడాది ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించినప్పుడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

జనవరి 25 నుంచి భారత్- ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఇండియా - ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ 

  • మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
  • రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
  • మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
  • నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
  • ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల

ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఎమర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.