IND vs SA 2nd Test: రాముడిలా బాణం ఎక్కుపెట్టిన కోహ్లి.. వీడియో వైరల్

IND vs SA 2nd Test: రాముడిలా బాణం ఎక్కుపెట్టిన కోహ్లి.. వీడియో వైరల్

భారత్‌తో జరుగుతున్న జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత పేస్ త్రయం సిరాజ్, బుమ్రా, ముఖేష్ కుమార్.. సఫారీ ఇన్నింగ్స్‌ను నిలువునా కూల్చారు. సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, ముకేష్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, సఫారీ ఇన్నింగ్స్ సమయంలో స్టేడియంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

34 పరుగుల వద్ద సిరాజ్.. మార్కో జాన్‌సెన్ (0)ని ఔట్ చేయగా తదుపరి బ్యాటర్‌గా కేశవ్ మహరాజ్ మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం నిర్వాహకులు ఆదిపురుష్ సినిమాలోని "రామ్ సియా రామ్" పాటను ప్లే చేశారు. ఆ లిరిక్స్ విన్న వెంటనే విరాట్ కోహ్లీ రెండు చేతులెత్తి రాముడిని నమస్కరించారు. ఆ వెంటనే బాణం వదులుతున్నట్లు రాముడిని అనుకరించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.