హైదరాబాద్, వెలుగు: ఎన్బీఎఫ్సీ కంపెనీ ఇండెల్ మనీ సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. గ్రీన్ షూ ఆప్షన్‌తో కలిపి రూ.500 కోట్ల మొత్తం ఇష్యూ కేవలం నాలుగు గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయింది.
ఈనెల 18– 20 తేదీల్లో ఇష్యూ నిర్వహించారు. కంపెనీ రూ.250 కోట్లను బేస్ సైజుగా నిర్ణయించగా, రూ.1,759 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఇది బేస్ ఇష్యూ పరిమాణంలో 704 శాతం అని కంపెనీ తెలిపింది.
ఈ ఎన్‌సీడీల ద్వారా వార్షికంగా గరిష్టంగా 12.25 శాతం వరకు రాబడి వస్తుంది. ఇవి బీఎస్‌ఈలో లిస్ట్ అవుతాయి. ఈ స్పందన తమపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని తెలుపుతోందని సంస్థ హోల్ టైమ్ డైరెక్టర్ ఉమేష్ మోహనన్ పేర్కొన్నారు. ఈ నిధులను రుణ కార్యకలాపాల విస్తరణకు, అప్పుల చెల్లింపులకు ఉపయోగిస్తామని తెలిపారు.
