తెలంగాణ జానపద పాటలతో ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా దిలీప్ సాయి నాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. యం.యస్ వారాహి క్రియేషన్స్ , శివమ్ మీడియా బ్యానర్స్‌పై ముని శివ, శివమల్లాల నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కిట్టుపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు లిరిక్ రైటర్ చంద్రబోస్ క్లాప్ కొట్టారు. ఆర్ పి పట్నాయక్ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు సతీష్ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్ చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. అనంతరం అతిథులంతా మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఓ చిన్న నటుడిగా ఫోక్ సాంగ్స్ చేస్తున్న తనను ఇందరు సినీ పెద్దలు వచ్చి సపోర్ట్ చేయడం సంతోషంగా ఉందని కిట్టు చెప్పాడు. మూవీ టీమ్‌తో పాటు పలువురు జానపద కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
