Argentina vs Netherlands: మహిళల ఎఫ్ఐహెచ్ (FIH) వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా సంచలన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో వరుసగా నాలుగు సార్లు విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ డ్రీమ్ రన్‌కు అర్జెంటీనా బ్రేక్ వేసింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-–1 తేడాతో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో అర్జెంటీనా 3–1తో డచ్ జట్టును చిత్తు చేసి తన మూడో ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. 2022 ప్రపంచకప్ ఫైనల్, టోక్యో ఒలింపిక్స్ ఫైనల్ ఓటములకు డచ్‌పై ప్రతీకారం తీర్చుకుంటూ అర్జెంటీనా ఈ ఘనత సాధించింది. గతంలో అర్జెంటీనా 2002, 2010 లలో టైటిళ్లు గెలుచుకుంది.
ఫస్ట్ హాఫ్‌లో డచ్ దూకుడు.. సెకండ్ హాఫ్‌లో అర్జెంటీనా కమ్‌బ్యాక్:
తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 30వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను ప్రపంచ నంబర్ వన్ డ్రాగ్ ఫ్లిక్కర్ యిబ్బి జాన్సెన్ గోల్‌గా మలిచి నెదర్లాండ్స్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత అర్జెంటీనా వరుసగా పెనాల్టీ కార్నర్లతో విరుచుకుపడింది. మ్యాచ్ మొత్తంలో 8 పెనాల్టీ కార్నర్లు సాధించిన అర్జెంటీనా, 54వ నిమిషంలో ఎనిమిదో పెనాల్టీ కార్నర్ రీబౌండ్ ద్వారా కెప్టెన్ మారియా గ్రెనాటో అద్భుత గోల్ కొట్టడంతో మ్యాచ్ 1–1తో సమమైంది.
షూటౌట్లో అర్జెంటీనా రచ్చ:
నిర్ణీత సమయం ముగిసేసరికి సమంగా నిలవడంతో విజేతను తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. షూటౌట్లో అర్జెంటీనా ప్లేయర్లు విక్టోరియా గ్రెనాటో, బ్రిసా బ్రగ్గెస్సర్, సోఫియా కైరో గోల్స్ సాధించారు. మరోవైపు డచ్ జట్టులో కేవలం మారిజ్న్ వీన్ మాత్రమే గోల్ చేయగా, పియెన్ సాండర్స్, ఫెలిస్ అల్బర్స్ చాన్స్ మిస్ చేసుకున్నారు. దీంతో షూటౌట్లో 3-1తో నెదర్లాండ్స్‌ను ఓడించి అర్జెంటీనా సరికొత్త చరిత్ర సృష్టించింది.
సెమీస్ పోరు, మూడో స్థానం:
తొమ్మిది సార్లు ఛాంపియన్ అయిన నెదర్లాండ్స్ సెమీఫైనల్లో 1 గోల్ తేడాతో బెల్జియంను ఓడించగా, అర్జెంటీనా కూడా సెమీస్‌లో 1 గోల్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక మూడో స్థానం కోసం జరిగిన ప్లే-ఆఫ్ పోరులో బెల్జియం 1–0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది.
VIDEO | Amstelveen: After Argentina's win in the FIH World Cup, Argentina captain Maria Granatto says, "I think this World Cup win is really important for us. We fight together all the time and we are really happy to finally win this final. I think we deserved this because we had… pic.twitter.com/5JXpZeibkl
— Press Trust of India (@PTI_News) August 29, 2026
🏆 ARGENTINA ARE WORLD CHAMPIONS! 🇦🇷
— Harpinder Singh (@HarpinderTohra) August 29, 2026
Argentina beat the Netherlands 3–1 in a shootout after the final ended 1–1 in regulation time to win the Women’s Hockey World Cup 2026! 🏑
What a thrilling final🏆#HockeyWorldCup #FIH #Argentina #Hockey pic.twitter.com/flXD0ZEsqc
