కాప్రా చెరువులో గణేశ్ నిమజ్జనాలు వద్దు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

కాప్రా చెరువులో గణేశ్ నిమజ్జనాలు వద్దు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ వెట్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ జాబితాలో చోటు దక్కించుకున్న కాప్రా చెరువులో గణేశ్ నిమజ్జనాలు చేయొద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.

శనివారం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన.. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. చిన్న విగ్రహాల నిమజ్జనానికి సమీపంలోని బేబీ పాండ్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించాలని, పెద్ద విగ్రహాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

113 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాప్రా చెరువు ఆస్ట్రేలియా, యూరప్ దేశాల నుంచి వచ్చే 470కి పైగా వలస పక్షులకు ఆవాసంగా ఉందని తెలిపారు. వెట్‌‌‌‌‌‌‌‌ల్యాండ్స్ పరిరక్షణ నిబంధనల ప్రకారం చెరువును కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

వరద నీటి నిల్వ, జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యాలతో హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు.  ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్త, హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, విమోస్‌‌‌‌‌‌‌‌ టెక్నోక్రాట్స్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ యూనస్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.