న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. కోణార్క్ పేరుతో సరికొత్త మోడల్‌ను శనివారం జరిగిన యాన్యువల్ కమ్యూనిటీ డే ఈవెంట్లో ఆవిష్కరించింది. ధర రూ.లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. దీని ద్వారా మాస్ మార్కెట్ కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ కోరుకుంటోంది. కోణార్క్100 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధర రూ.లక్ష కాగా, 125 కిలోమీటర్ల వేరియంట్ ధర రూ.1.22 లక్షలు. హైఎండ్144 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధరను రూ.1.45 లక్షలుగా ఖరారు చేశారు.
భవిష్యత్తులో మరికొన్ని వేరియంట్లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఎస్ వేరియంట్లలో ఏడు ఇంచుల డీప్‌వ్యూ డిస్‌ప్లే, బేస్ వేరియంట్‌లో 4.2-అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. కీలెస్ సిస్టమ్ కలిగిన మ్యాజిక్ కీ ద్వారా స్మార్ట్ వేక్, వాక్-అవే ఆటో-లాక్, ఆఫ్‌లైన్ స్టార్ట్ వంటి సదుపాయాలు లభిస్తాయి.
కీఫోబ్ లేదా టచ్ స్విచ్‌తో ఆటోమేటిక్‌గా తెరుచుకునే 31-లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ దీని సొంతం. ఇరుకైన ప్రదేశాలలో సులువుగా నడిపించడానికి ఎయిర్‌వాక్ అసిస్ట్ సహకరిస్తుంది. సౌకర్యవంతమైన పిలియన్ బ్యాక్‌రెస్ట్, సెంటర్ స్టాండ్ ఉన్నాయి. ఏథర్ యాప్ ద్వారా వాహన ఆరోగ్యం, రీసేల్ వాల్యూ అంచనాలను తెలుసుకోవచ్చు. ఏఈబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.
మోడల్ రేంజ్ బ్యాటరీ డెలివరీ ధర
కోణార్క్ 100 100 కిమీ 2.1 కిలోవాట్స్ 2027 క్యూ1 రూ. లక్ష
ఎస్ 125 125 కిమీ 2.7 కిలోవాట్స్ వచ్చే నెల రూ. 1.22 లక్షలు
ఎస్ 161 161 కిమీ 3.5 కిలోవాట్స్ వచ్చే నెల రూ.1.45 లక్షలు
ఎస్ 200 200 కిమీ - 2027 క్యూ3 త్వరలో ప్రకటిస్తారు
జెడ్ 125 125 కిమీ - 2027 క్యూ3 త్వరలో ప్రకటిస్తారు
జెడ్ 161 161 కిమీ - 2027 క్యూ3 త్వరలో ప్రకటిస్తారు
