హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా, కెమెరాలపై ఆఫర్లు ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. సోనీ, కెనాన్, ఇన్‌స్టా360 లాంటి బ్రాండ్ల కెమెరాలు, వాటి యాక్సెసరీలపై 70 శాతం వరకు తగ్గింపు ఇస్తామని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ. 4,500 వరకు తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు.
ఈ ఆఫర్లు ఆగస్టు 19 వరకు ఉంటాయి. ఈ సేల్ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. సోనీ ఆల్ఫా ఐఎల్‌సీఈ-7ఎమ్3కే కెమెరాను రూ. 1,36,490కు, కెనాన్ ఈఓఎస్ ఆర్8 కెమెరాను రూ. 1,04,990కు, ఇన్‌స్టా360 ఎక్స్3 యాక్షన్ కెమెరాను రూ. 29,990కు, సోనీ ఈ మౌంట్ ఈ పీజెడ్ 18-105ఎమ్ఎమ్ ఏపీఎస్-సీ లెన్స్‌ను రూ. 35,290కు కొనుక్కోవచ్చు.
