తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 345 ఆలౌట్‌

తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 345 ఆలౌట్‌

కాన్పూర్‌: కివీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పర్వాలేదనిపించింది టీమిండియా. 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టెస్టుల్లో అరంగేట్రం చేసిన శ్రేయస్  అయ్యర్  సెంచరీ చేశాడు. 171 బాల్స్ లో 13 ఫోర్లు, 2 సిక్సులతో 105 రన్స్ చేశాడు. రవీంద్ర జడేజా 50 పరుగులు చేశాడు. ఇక టెయిలెండర్లలో రవిచంద్రన్  అశ్విన్  38 పరుగులతో పర్వాలేదనిపించాడు. కివీస్  బౌలర్లలో టిమ్ సౌథీ 5 వికెట్లు తీయగా... కైల్ జేమీసన్ 3, అజాద్ పటేల్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. 

ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ టెస్ట్ లోనే పలు రికార్డులు క్రియేట్ చేశాడు అయ్యర్. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్టులోనే సెంచరీతో మెరిశాడు. దీంతో తొలి టెస్ట్ లోనే సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అదే విధంగా డెబ్యూ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. 4 వికెట్లకు 258 పరుగుల ఓవర్ నైట్  స్కోర్  తో సెకండ్ డే ఆట ప్రారంభించిన టీమిండియా... మరో 87 రన్స్ చేసి.. మిగతా ఆరు వికెట్లు కోల్పొయింది. ఫస్ట్ డే ఒక్క వికెట్ తో సరిపెట్టుకున్న సౌథీ ఇవాళ మరో 4 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్  ప్రారంభించిన కివీస్.. కూల్ గా ఆడుతోంది. 
 

In