FIH యూత్ హాకీ 5 ఎస్‌‌ చాంపియన్షిప్: పాక్‌‌కు ఇండియా చెక్‌‌

FIH యూత్ హాకీ 5 ఎస్‌‌ చాంపియన్షిప్: పాక్‌‌కు ఇండియా చెక్‌‌

మస్కట్‌‌ (ఒమన్‌‌): ఎఫ్‌‌ఐహెచ్‌‌ యూత్‌‌ హాకీ 5 ఎస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా సబ్‌‌ జూనియర్‌‌ బాలుర జట్టు దుమ్మురేపింది. వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో గెలిచింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 7–3 గోల్స్‌‌ తేడాతో పాకిస్తాన్‌‌ను చిత్తు చేసింది.

ఇండియా తరఫున రోమిత్‌‌ పాల్‌‌ (8వ ని), కరణ్‌‌ గౌతమ్‌‌ (10వ ని), కెప్టెన్‌‌ కేతన్‌‌ కుష్వాహా (10, 20వ ని), ప్రహ్లాద్‌‌ రాజ్‌‌భర్‌‌ (12వ ని), షారుక్‌‌ అలీ (16వ ని), రాహుల్‌‌ యాదవ్‌‌ (18వ ని) గోల్స్‌‌ చేశారు. మహ్మద్‌‌ ఉస్మాన్‌‌ (12, 15వ ని), కెప్టెన్‌‌ అదీల్‌‌ (17వ ని) పాక్‌‌కు గోల్స్ అందించారు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 10–1తో ఒమన్‌‌పై గెలిచింది. షారుక్‌‌ అలీ (3, 10వ ని), కేతన్‌‌ కుష్వాహా (6, 8, 11, 19వ ని), కరణ్‌‌ గౌతమ్‌‌ (2. 15వ ని), ప్రహ్లాద్‌‌ రాజ్‌‌భర్‌‌ (3, 16వ ని) గోల్స్‌‌తో హోరెత్తించారు.

విమెన్స్‌‌ ఎలైట్‌‌ పూల్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా 3–6తో చైనా చేతిలో ఓడింది. సందీప కుమారి (1వ ని), కిరణ్‌‌ ఎక్కా (3, 6వ ని) ఇండియాకు గోల్స్‌‌ అందించారు.