వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇండియా సంచలనం.. గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ జాస్మిన్ లంబోరియా

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇండియా సంచలనం.. గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ జాస్మిన్ లంబోరియా

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ 2025 లో సంచలనం నమోదైంది. విశ్వవేదికగా భారత్ బంగారు పథకాన్ని సాధించింది. ఇండియన్ బాక్సర్ జాస్మిన్ లంబోరియా గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. 57 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించి భారత పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించింది. 

ఇంగ్లండ్ లివర్ పూల్ లో శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన పోటీల్లో.. పారిస్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్.. పోలండ్ ప్లేయర్ జూలియా జెరెమెటా తో తలపడిన జాస్మిన్.. ఇండియా తరఫున ఈ  ఈవెంట్ లో తొలి గోల్డ్ మెడల్ విన్నర్ గా రికార్డు సృష్టించింది. జెరెమెటాపై 4-1 తేడాతో మెడల్ అందుకుంది. 

మ్యాచ్ మొదట్లో స్లోగా ఆడిన జాస్మిన్.. ఆ తర్వాత పుంజుకుని ఆశ్చర్యకరమైన పంచ్ లతో ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా మేనేజ్ చేసింది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి తొందరగా వైదొలిగిన తనకు.. ఈ విన్ చాలా స్పెషల్ గా అనిపిస్తోందని జాస్మిన్ ఈ సందర్భంగా చెప్పింది. పారిస్ ఓటమి తర్వాత ఫిజికల్ గా.. మెంటల్ గా ఇంప్రూవ్ అయ్యానని.. కన్సిస్టెంట్ గా.. పట్టుదలగా చేసిన ప్రాక్టీస్ కు ఫలితం ఈ గోల్డ్ మెడల్ అని జాస్మిన్ చెప్పుకొచ్చింది. 

నుపుర్, పూజా రాణికి మెడల్స్:

మరోవైపు ఇదే ఈవెంట్లో ఇండియా బాక్సర్లు నుపుర్, పూజారాణిలు కూడా పథకాలు సాధించారు. పూజా రాణి బ్రాంజ్(కాంస్యం) మెడల్ అందుకోగా.. నుపుర్ 80 కేజీల కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించారు.