విదేశాల నుంచి వచ్చేటోళ్లకు కరోనా రిపోర్ట్ అక్కర్లే

విదేశాల నుంచి వచ్చేటోళ్లకు కరోనా రిపోర్ట్ అక్కర్లే

న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుతుండడంతో అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన గైడ్-లైన్స్ ను కేంద్రం సవరించింది. ఈ నెల 13 నుంచి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌‌‌‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులు 'కరోనా టెస్ట్ రిపోర్ట్'ని సమర్పించాల్సిన అవసరంలేదని తెలిపింది. వారి ఆరోగ్య సమాచారాన్ని కూడా సేకరించాల్సిన పనిలేదని వెల్లడించింది. గడిచిన నాలుగు వారాలుగా ఈ దేశాల్లో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్  భూషణ్‌‌‌‌  తెలిపారు.