ఇండియాలో మోటార్‌‌‌‌సైకిల్‌‌‌‌ ఈ రేస్ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌

ఇండియాలో మోటార్‌‌‌‌సైకిల్‌‌‌‌ ఈ రేస్ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ప్రతిష్ఠాత్మక ఎఫ్‌‌‌‌ఐఎమ్‌‌‌‌ ఎలక్ట్రిక్ మోటార్‌‌‌‌ సైకిల్‌‌‌‌ రేసింగ్‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌నకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. రేసింగ్‌‌‌‌ రెండో సీజన్ గ్రాండ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ కూడా నవంబర్‌‌‌‌లో ఇండియాలో జరగనుంది. ఈ మేరకు రేస్‌‌‌‌లు నిర్వహించే ఎఫ్‌‌‌‌ఐఎమ్​ ఈ–ఎక్స్‌‌‌‌ప్లోరర్‌‌‌‌‌‌‌‌తో  రాష్ట్రానికి చెందిన  కంకణాల స్పోర్ట్స్‌‌‌‌ గ్రూప్(కేఎస్‌‌‌‌జీ)  తొమ్మిదేండ్ల కాలానికి  ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఇండియా టీమ్ తొలిసారి బరిలోకి దిగుతుందని కేఎస్‌‌‌‌జీ గ్రూప్ ఓనర్ కంకణాల అభిషేక్‌‌‌‌రెడ్డి తెలిపారు.